పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

26 సూత్రక్రీడా॥ దారము త్రెంపికలుపుట రంగులుగాజూపుటలోనగు వినోదము లెఱుంగుట.

27 వీణాడమరుక వాద్యాని॥వీణాడమరుకాదులు మనోహరముగా వాయించుట.

28 ప్రహేలిక॥ ఇది కావ్యప్రసిద్ధము పరవ్యామోహనము నిమిత్తముపయోగము. గూఢముగానుంచబడిన అర్ధముగల కావ్య విశేషము

29 ప్రతిమాలా॥ శ్లోకముల యంత్యమాక్షరములు జదివిన శ్లోకమగుట

30 దుర్వాచకయోగాః॥ శబార్థములచేఁ దెలియబడక చదువ శక్యముగాని యక్షరోపశ్లేషములుగల శ్లోకములు రచించుటయుఁ జదువుటయు

31 పుస్తచకవాచసం॥ శ్లోకములఁ బదములుగాను బదములశ్లోకములుగాను సంగీతముగాఁ జదువుట.

32 నాటకాఖ్యాయికాదశన్‌నం॥ నాటకములు పదివిధములు శ్లో॥ నాటక మంకో, వీధీ, ప్రకరణ, మీహామృగో, ఢిమో, భాణః॥ వ్యాయోగ సమవాకారో, ప్రసనమితి. ఈదశ విధనాటకములు రచించుట.

33 కావ్యసమస్యాపూరణం॥ శ్లోకసమస్యపూర్తి చేయుట.

34 పట్టికావేత్రాసన వికల్పాః॥ పేముచే మంచములును పీఠములు లోనగు నుపకరణములు రచించుట.

35 తలకర్మాణి॥ అపద్రవ్యార్ధములైన కుందకర్మలు,

36 తక్షణం॥ శయనాసనాద్యర్ధములగు వకిర్ధ కర్మలు.

37 వాస్తు॥ విద్యాగృహకల్మర కుపయోగించువిద్య.

38 రూప్యరత్న పరీక్షా॥ దీనారముల యొక్కయు నవరత్నముల యొక్కయు గుణదోషముల నెరుంగుట. ఇవి వ్యవహారాంశములు.

39 ధాతువాదః॥ మృత్ విప్రస్తరరత్న ధాతువులయొక్క సాత్యన శోధన మేళనాదుల నెఱుంగుట.