పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రుక్మిణికథ.

43

14 మాల్యగ్రధన వికల్ఫాః॥ విచిత్రములుగా దండలు గట్టుట.

16 శేఖరకాపీడనయోజనం॥ అనేక రూపములుగా శిఖలముడుచుట, వానియందు మాలికలు గూర్చుట, ఇవిరెండును నేపధ్యాంగములు.

16 నేపధ్యప్రయోగాః॥ దేశకాలానుగుణ్యముగా వస్త్ర మాల్యాభరణాదులచే శోభకొరకు శరీరమలకరించుట.

17 కర్ణపత్రభంగాః॥ దంత శంఖాదులచేఁ గర్ణ పత్రములు జేసి యలంకరించుట.

18 గంధయుక్తిః॥| స్వశాస్త్ర విహితప్రపఞ్చా, ప్రతీతప్రయోజనైవ।

ఆశాస్త్రమందు విధింపబడిన రీతిగలది. (పరిమళవస్తునిర్మాణము) దీనిప్రయోజనము సర్వప్రసిద్ధము.

19 భూషణయోజనం॥ మణిముక్తాప్రవాళాదులచే పేరులు కట్టుట, కటకకుండలాదులుచేయుట ఇవి నేపధ్యాంగములు వస్తురచన కాని శరీర మలంకరించుటగాదు.

20 ఇంద్రజాలాః॥ ఇంద్రజాలశాస్త్రప్రభవమలగు యోగములు సై న్యదేవాలయాదులఁ జూపించుట ఇవి పరమోహనార్ధములు.

21 కౌచుమారాశ్చయోగాః॥ కుచుమారునిచేఁ జెప్పబడిన సుభగంకరణాద్యుపాయ యోగములు.

22 హస్తలాఘవం॥ సర్వకర్మలయందు లఘువాస్తత్వము.

23 విచిత్రశాఖ యూషభక్ష్యవికారక్రియాః॥ భక్ష్యభోజ్యశాకాదులరుచు లుప్పతిల్లునట్లు వండుట.

24 పానక రస రా గాంసవ యోజనం॥ గుడతింత్రిణీకాదులచేఁ బానకమును ద్రాక్షామోచాఫలాదులచే మద్యమును మధురముగా వండుట

25 సూచీవానకమాన్‌ణి॥ సూదితో జేయఁదగినపనులు బంతులు తివాసులులోనగునవి యల్లుట.