పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రుక్మిణికథ.

41

రత్న పరీక్ష, సీవనము, రంగపరిజ్ఞానము, ఉపకరణక్రియ, మానవిధి, అజీవజ్ఞానము, తిర్యగ్యోనిచికిత్సితము, మాయాకృతపాషండ సమయజ్ఞానము, క్రీడాకౌశలము, లోకజ్ఞానము, వై చక్షణ్యము, సంవాహనము, శరీరసంస్కారము, విశేషకౌశలము. 24,

ద్యూతాశ్రయములు 20.

ఆయుఃప్రాప్తి , అక్షవిధానము, రూపసంఖ్య, క్రియామాగన్‌ణము, బీజగ్రహణము, నయిజ్ఞానము, కరణాదానము, చిత్రాచిత్రవిధి, గూఢరాశి, తుల్యాభిహారము, క్షిప్రగ్రహణము, అనుప్రాప్తి లేఖస్శృతి, అగ్నిక్రమము, ఛలవ్యామోహనము, గ్రహదానము, ఉపస్థానవిధి, యుద్ధము, రుతము, గతము, నృత్తము ఇవి యిరువది.

శయనోపచారికములు 16.

పురుషభావగ్రహణము, స్వ రాగప్రకాశనము, ప్రత్యంగదానము, నఖదంతవిచారము, నీవీస్రంసనము, సంస్పశన్‌నానులోమ్యము, పరమార్ధకౌశలము, హషన్‌ణము, సమానార్థాతాకృతార్ధత, అను ప్రోత్సాహనము, మృదుక్రోధప్రవర్తనము, సమ్యక్రోధనివర్తనము, క్రుద్ధప్రసాదనము, సుప్త పరిత్యాగము, చరమస్వాపవిధి, గుహ్యగూహనము.

ఉతరకళలు 4.

అశ్రుపాతముతో రమణునికి శాపమిచ్చుట, స్వశపధక్రియ, ప్రస్థితానుగమనము తిరిగితిరిగి చూచుట, ఇవి మూలకళ లనఁబడును.

చతుష్షష్టికళలను బలువురు పలువిధంబులం జెప్పుచుందురు వాత్స్యాయనోక్తములు పాంచాలోక్తములు శాకపాకములు సేయుటకు నలంకరించుకొనుటకుఁ జాలభాగ ముపచరించును. కవిత్వము అవధానములు ఇంద్రజాలములులోనగు విషయములు వర్ణింపబడియున్నవి పాంచాలోక్తములు కేవలము క్రీడాయోగ్యములు. శాస్త్ర ప్రశంస, శస్త్రాస్త్రనైపుణ్యము అశ్వగజాదిశిక్షణములు ప్రకటింపఁబడినవి. పెక్కేల వానినెఱింగినవారి కెందుఁబోయినను విజయమే కలుగును.