పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

ఎక్కడనోకాని శాస్త్రజ్ఞులు లేరుగదా ? సంప్రయోగము సర్వజన విషయమైనది. ఈరెంటికి సామరస్య మెట్లుకలిగెడిని ?

చారు — శాస్త్రజ్ఞుఁడు దూరమందున్నను పారంపర్యముగా వ్యాపింపక మానదు.

మఱియు సూ॥ సంత్యపిఖలు శాస్త్రప్రహత బుద్ధయో గణికా రాజదుహిత్ర్యో మహామాత్రదుహితరశ్చ.

వేశ్యాంగనలు రాజపుత్రికలు సామంతుల కూఁతుండ్రు ఈ శాస్త్రమెఱింగినవారుందురు. వారివలనఁ జదివికొనవచ్చును.

రాజ -- అట్టివాండ్రు దొరకుట దుర్షటముగాదా. నేఁడు మా పూర్వపుణ్యమువలన నీవు లభించితివి కావున నింతవిస్రబ్ధముగా నడుగు చుంటిని. వీని నెట్టివారివలన గ్రహింపఁదగినది.

చారు - విశ్వాసముగల స్త్రీవలన నీసాంప్రదాయరహస్యములతో నభ్యాసమువలనఁ బ్రయోగింపఁదగిన చతుషష్టికళను దెలిసికొనవలయును.

రాజ — విశ్వసింపఁదగిన వారెట్టివారో చెప్పుము.

చారు - ప్రవృత్తపురుషసంపర్కముగల తనతోఁ బెరిగినదాసీ పుత్రిక సఖురాలు. పినతల్లి. వృద్ధదాసి. బిక్షుకురాలు అక్క. యిట్టి వారు విశ్వసింపఁదగినవారు.

రాజపుత్రిక -- చారుమతీ. చతుష్షష్టికళలు పలువిధంబులనొప్పు చుండునని చెప్పుదురు. వానిభేదంబుల వివరింతువే. అనుటయుఁ జారుమతి పుస్తకమువిప్పి యిట్లుచెప్పుచున్నది.

శాస్త్రాంతరమున నరువదినాల్గు మూలకళలని చెప్పఁబడి యున్నవి. అందుఁ గమాన్‌శ్రయము లిరువదినాలుగు గీతము నృత్యము, వాద్యము, కౌశలలిపిజ్ఞానము, ఉదారవచనము, చిత్రవిధి, పుస్తకమన్, పత్రచ్ఛేద్యము, మాల్యవిధి, గంధయుక్త్యాస్వాద్యవిధానము.