పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రుక్మిణికథ.

39

పార దారిక ప్రకరణము తప్పకచేయఁదగినదని విధించలేదు. ఇది పాపకృత్యమని తెలుపుచు లోకప్రవృత్తి యిట్లుండునని దశాప్రకరణపద్ధతి ననుసరించి చెప్పితిని. కాని విధియని కాదని యాచార్యులే వ్రాసికొనిరి చూచితివా?

రాజపుత్రి – సూ॥ తదంగ విద్యాః పురుపోధీయేత॥ దీని బురుషులే చదువవలయునని విధిగనంబడుచున్నదే? స్త్రీలుచదువవచ్చునా?

చారు — సూ॥ ప్రాగ్యౌవనాత్ స్త్రీ యౌవనోనయము కాక మున్ను చదువవలయునని చెప్పఁబడినది.

రాజ - ఇసిరో యౌవనము రాకమున్న యీగ్రంథము జదివిన నీ కేమి తెలియును? శుకపాఠమేయగును.

చారు — ప్రత్తాచ పత్యురభిప్రయాత్.

పెండ్లియైన తరువాత స్త్రీ పతియనుమతి వడసి చదువవచ్చునని యాచార్యులే వ్రాసియున్నారు.

రాజ — సూ॥ యోషితాంశాస్త్రగ్రహణస్యా భావాదనర్ధక మిహశాస్త్రేం స్త్రీశాసనమిత్యాచార్యాః స్త్రీలు శాస్త్రగ్రహణ విహీనలగుట నిందుఁజెప్పబడిన విషయంబులు గ్రహింపజాలరు. అప్పు డీ శాస్త్రమువలనఁ బ్రయోజన మేమియున్నది ?

చారు - సూ॥ ప్రయోగగ్రహణంత్వాసం ప్రయోగస్యచ శాస్త్రపూర్వకత్వాదితి వాత్స్యాయనః॥

స్త్రీలకు శాస్త్రగ్రహణము లేకపోవుగాక సంప్రయోగము శాస్త్రపూర్వకమగుట స్త్రీల కుపదేశింపఁదగియున్నది. కావున నిది నిరర్ధకము కానేరదు. శాస్త్రమే లేనిచో విధి యెట్లుతెలియఁబడును. ఎట్లుపదేశింతురు.

రాజపుత్రి - సరే. శాస్త్ర మావశ్యకమని యొప్పుకొనియెదను