పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

శ్లో॥ ధర్మమూలస్మృత స్వగన్‌స్తత్రాపి పరమాస్త్రియః।
     గృహస్థ ధర్మో దుర్వారో నరాణాందైవ యత్నజః॥
     హితాశ్చా పత్యసంతానై స్త్రియస్త్స్విహ పరత్రచ
     పరం సంప్రత్యయో భోగః ప్రకషాన్‌ర్ధాయ వై స్త్రియః॥

స్వగన్‌ము ధర్మమూలకమైనది. అందుఁగూడ స్త్రీలే ముఖ్యులుగాఁ జెప్పబడిరి. ధర్మయత్నజనితంబగు గృహస్థధర్మము దుర్వారమైనది సంతాన లాభమువలన స్త్రీలు ఇహపరసుఖముల నొసంగుచున్నారు కావున స్త్రీభోగము ప్రకర్షార్ధమునకు గారణమగుచున్న ది.

రాజపుత్రి ! స్త్రీ దోషప్రశంస మీమాటలకు బ్రతికూలమగు నేమో

చా - అబ్బో నీవు చాల చదివితివిగదా. పశువులు మేయునని చేలు జల్లుకొనుట మానుదురా ? బిక్షుకులు వత్తురని పాత్రలు పంసా దింపకుందురా ? స్త్రీదోషముల వివరించి స్త్రీలఁబరిగ్రహింపకుండుట దూష్యముకాదా?

రాజ -- (నవ్వుచు) చారుమతీ ! “నాపరదారా గచ్ఛేత్ ” అని శాస్త్రములు ఘోషింపుచున్నవిగదా? ఈ గ్రంథకర్త పారదారక ప్రకరణమెందులకు వ్రాయవలెను.

చారు - మంచిశంకయే చేసితివి వినుము. ఇది పాపకృత్యమని యెఱింగియు లోకప్రవృత్తి యిట్లుండునని తెలుపుటకై యిందువ్రాసిరి. మఱియుఁ బారదారికప్రకరణ మెఱింగినవాఁడుగాని స్వదారను రక్షించుకొనఁజాలఁడు. అని గ్రంథకర్తలేవ్రాసికొని యున్నారు. చూడుము.

శ్లో॥ భార్యాధికారికమిదం కథితం సమాసాడ్
     వక్ష్యామి సంప్రతిపరప్రమదాభియోగం।
     ఆయుర్యశోరిపు రధర్మ సుహృ త్స చాయం
     కార్యో దశావిషయ హేతువశా న్న కామాత్॥