పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రుక్మిణికథ.

37

చేయుచుంటి పరిహసింపకేమి. త్రివర్గములో ధర్మార్థములకు శాస్త్ర మావశ్యకముగాని కామమునకు శాస్త్రపాఠమేల? కామము జంతువులకు నిత్యమైనదికాదా? పశుపక్ష్యాదికములకు స్వకాంతారమనో పాయ మెవ్వఁ డుపదేశింపుచున్నాఁడు ?

చారు - తరుణీ! వినుము. సూ॥ సంప్రయోగపరాధీనత్వాత్ సచ స్త్రీ పురుష యోనుపాయ మపేక్షతె॥ కామము సంప్రయోగపరాధీన మైనదగుట నుపాయ మపేక్షించుచున్నది. అయ్యుపాయంబు శాస్త్రపఠనంబునంగాని లభింపదు. పశుపక్ష్యాదు లావరణశూన్యములగుట ఋతుకాలమందె సంయోగాపేక్షగలవగుట వానికి శాస్త్రావశ్యకము కాన్పింపదు. మనుష్యులకు గమ్యాగమ్య వివక్షయు సంతోషావసాన ప్రతీకారములు గలుగుటంబట్టి శాస్త్రమావశ్యకంబై యున్నది.

రాజపుత్రి --- సూ॥ నకామాన్ చరేత్ ॥ పాండురాజు రావణుఁడు మొదలగు కాముకులు విశేషకామంబునఁ జెడిపోయిరికాదే. సామాన్య కామంబునఁదృప్తి బొందక విశేష కామంబునకేల ప్రయత్నింపవలయును?

చారు - రావణాదు లధర్మకామంబునంజెడిపోయిరి. ధర్మార్ధహాని కాకుండఁ గామమును బ్రవర్తింప జేయవలయునని శాస్త్రము ఘోషింపుచున్నది. ఇందులకే శాస్త్రపాఠము. మఱియొక విశేషము వినుము.

సూ॥ శరీరస్థితిహెతుత్వా దాహారసధమాన్ ణొహికామాః అజీణన్‌దిరోగ జనకంబైనను నాహారము శరీరస్థితికి హేతువగునట్లు కామముగూడ హేతువేయగుచున్నది. మఱియు,

సూ॥ ఫలభూతాశ్చ ధర్మార్థయోః॥ ధర్మార్ధములయొక్క సేవ సుఖముకొఱకే కదా అట్టిసుఖము కామమే.

రాజపుత్రి) – (నవ్వుచు) ధర్మార్థములయొక్క సేవ కామము నిమిత్తమా ఈమాటకుఁ బ్రాజ్ఞులు సమ్మతింతురా

చారు - సందియమేలా వినుము.