పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

చా - వినుము. బాల్యము, యౌవనము కౌమారము వార్ధక్యము, నాలుగు భాగములుగాఁ జేసికొని

సూ॥ బాల్యె విద్యాగ్రహణా దీనర్ధాన్॥

బాల్యంబున విద్యాగ్రహణాదికమగు నర్ధముల సంపాదింప వలయును.

రాజ – బాల్యమన నెన్నియేండ్లవఱకు?

చారు – ఆషోడశాద్భ వేద్బాలః అనియున్నది. పదియారేఁడుల వఱకు బాలుఁడనఁబడును.

రాజ - తరువాత

చారు -- సూ॥ కామంచ యౌవనె॥ యౌవనమునఁ గామ మనుభవింపవలయును.

రాజ - తరువాత,

చా - సూ॥ స్థావిరే ధర్మం మోక్షంచ! ముసలితనమున ధర్మమునుగుఱించి యత్నింపవలయును.

రాజ - సఖీ! నాకిందొక సందియము గలుగుచున్నది. మౌనసమునందుఁ గామమేకాని యర్ధధర్మముల నార్జింపఁగూడదా?

చారు - నవ్వుచు నీ సందియ మీగ్రంధకర్తయేతీర్చె నాకర్ణింపుము. సూ॥ అనిత్యత్వాదాయుషో యథోపపాదం సేవేత! అనఁగా జీవిత మస్థిరమగుట నెప్పుడేది సిద్ధమగునో యప్పుడు ధర్మార్ధముల సంపాదింపవలయునని శాస్త్రకారులే చెప్పియున్నారు.

రాజ -సూ॥ తిర్యోగ్యోనిష్వపి స్వయంప్రవృత్తత్వాత్ కామస్యనిత్య త్వ్యాచ్చ న శాస్త్రకృత్య మస్త్రీత్యాచార్యాః॥

శ్లో॥ వినోపదేశంసిద్ధోహి కామోనాఖ్యాత శిక్షితః।
      స్వకాంతా రమణోపాయె కో గురుర్మృగపక్షిణాం॥

చారుమతీ! నిన్నేను గొన్నియెఁఱిగియు నెఱుంగని శంకలు