పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిత్రసమ్మేళనము.

393

భోజమహారాజు ఆచావడిలో నాపండితులతో నాంతరంగిక సభ గావించి లేచి నమస్కరించుచు నిట్లనియె. మహాత్ములారా ! ఇందున్నవారు జగత్పండితులు. యక్షుండు దేవతావిశేషుఁడు. ఇట్టివారికడ యథార్థము జెప్పినచో నేనుగావించిన పాతకము వాయఁగలదు. వినుండు. ఈకాళిదాసకవిసార్వ భౌముండు త్రిలోకపూజ్యుండు. నాకు బహిఃప్రాణము. ఈతనివిడిచి నేను క్షణకాలము నిలువలేను. ఇట్టివిస్రంభ పాత్రుని విమర్శింపక బాలిశులుపన్నిన కపటవ్యూహమునఁ జిక్కి నిష్కారణము నవ్వలఁ బొమ్మంటి; నయ్యనుమానముననే మహాసాధ్వీలలామము నడవిపాలు గావించుకొంటిని. ఆపాతకము ననుభవించుచు స్థానభ్రష్టుండనై దేశములఁ దిరిగితిని, భైరవునిచే మేషముగాఁ జేయఁబడితిని. చివర కీమహాత్మునిచేతనే విముక్తి నొందితిని. నాఁడు నన్నితండు విడిపించనిచో నీపాటికిఁ బరలోక మలంకరించువాఁడనే. మహాత్ము లపకారికే యుపకారము సేయుదురు. నా కట్టియుపకారము గావించి నా ప్రార్థనల నంగీకరించి తిరుగా నాయింటికి విచ్చేసెను. నాకు లీలావతీవియోగదుఃఖముతో పాటు రుక్మిణీచిత్రసేనుల యసభ్యప్రవర్తనములు నాహృదయమును మిక్కిలి వేధింపఁదొడంగినవి. ఆచింతలుగూడ నీదివ్యజ్ఞాన సంపన్నుఁడు వదలఁజేసెను. దత్తకుండు నాకల్లుఁడు, కోడలు నయ్యెనని యెఱింగించెఁగదా? యక్షుండే యీనాటకమునకు సూత్రధారుండు. ఈనాటకకథ యందఱకుఁ దెలిసినవిషయముగానఁ దిరుగా వక్కాణింప నేమిటికి ? దత్తుండు నా కల్లుఁడయ్యెను. ఘోటకముఖుఁడు ప్రాణస్నేహితుఁడు. గోణికాపుత్రుండు నాకుమారునికి మిత్రుఁడు. గోనర్దీయ కుచుమారులు రాజబంధువులు. సువర్ణ నాభుండును దేవతుల్యుఁడు. యక్షుండు మనకందఱకు వంద్యుఁడు. నేఁ డిందఱుకొత్తమిత్రులనడుమ నిలిచి సంభాషింప నొనగూడినది. ఇంతకన్న భాగ్య మేమియున్నది. నా ప్రాణనాయకి లీలావతినిఁగూడఁ జూచితినేని యిట్టిసుదినము నాకు మఱి