పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రుక్మిణికథ.

29

రేవతి యాపుస్తకము విప్పి పేరుచదివి చిఱునగవుతోఁ దలయూచుచు నందందు బరిశీలించి వయస్యా ! నీవిప్పుడు దీనిఁజదువవలసినదే. వ్యాఖ్యానమున్నను గూఢముగానున్నది. దీనిం గురుముఖముగాఁ జదివి కొమ్ము. అని పలికిన రుక్మిణి యిట్లనియె.

రేవతీ ! దీనిం బురుషులయొద్దఁ జదువరాదుగదా ? శాస్త్ర పాండిత్యముగల స్త్రీలు మనకెక్కడ దొరకెదరు? తెలిసినంత మనమే గ్రహింపవలెను. నీవుగూడ విమర్శించి చూచుమనుటయు నది బాగు బాగు నీకంటె నాకెక్కువ పాండిత్యముగలదా ? తిన్నగాఁ జూచిన నీకేయర్ధమగును. లేనిచో బండితులనడిగి తెలిసికొనివచ్చెదనని పలికిన రుక్మిణి చాలుచాలు! మాటవరుసకంటి నీమాట యెన్వరికైనం జెప్పెదవుసుమీ? సిగ్గు సిగ్గు అని యాపుస్తకము పుచ్చుకొని యింటికిబోవుదము బండికట్టింపుము. అని యాజ్ఞాపించినది. అశ్వశకటము సన్నద్ధమైనదని విని రాజపుత్రిక రేవతికైదండ గొని మేడదిగివచ్చి బండియెక్కఁబోవుసమయంబున సశ్వరక్షకురాలు వచ్చి నమస్కరించుటయు రుక్మిణి, నేఁడు నీకతంబున వాహ్యళి చెడిపోయినది. గుఱ్ఱమేమిటికి బెదరినది ? మచ్చికచేయుటలేదా యేమి ? అని యడిగిన యాపరిచారిక అమ్మా! ఆబాడబమిట్టి యాగడమెన్నడును జేయలేదు. ఊరక బెదరి యెవరో లాగికొని పోవునట్లు పారిపోయినది. నిలుప నాశక్యమైనది కాదని చెప్పుచుండఁగనే యదిగో భర్తృదారికగుఱ్ఱము వచ్చుచున్నదని వనపాలికలు కేకలుబెట్టిరి. ఆమాటలు విని యందఱు నా మార్గము దెసకు దృష్టులు వ్యాపింపజేసిరి. అంతలో నొక చక్కని ఎవరాలు జీనుపైఁ గూర్చుండి కళ్ళెము లాగుచుండ నాహయం బతిరయంబున బరుగెత్తికొనివచ్చి రుక్మిణి యెక్కుచున్నబండి ప్రక్క నిలువంబడినది. రుక్మిణి యక్కలికిం జూచి యక్కజమందుచు జవ్వనీ ! నీ వెవ్వతెవు? యివ్వారువ మెక్కడ గసంబడినది ? దీనిందెచ్చి' మాకి