పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిత్రసమ్మేళనము.

387

సరస్వతి - (నవ్వుచు) అదిగో ! కుచుమారులు లేచుచున్నారు. ఇఁక వానిపని మట్టమగును.

అని యవనికాంతరమున స్త్రీలు సంభాషించుచుండిరి. ఆట కొంతవఱకు జరగినతరువాతఁ గుచుమారుఁడు లేచి యామృగముల దాపునకుఁ బోయి మెడలోనున్న యస్థిమాలను జేతంబూని మృగములకుఁ జూపుచు హుంకారము గావించెను. అప్పు డందున్న మృగములన్నియు నాతనియొద్దకు వచ్చి వినయ మభినయించుచు నిలువంబడినవి.

భైరవుఁడు చేతనున్న బెత్తముం జూపుచు రమ్మని యొకభల్లూకమును బిలిచెను. పోయినదికాదు. దానితో నొకదెబ్బకొట్టినంత బొబ్బ పెట్టుచు వానిమీఁదఁబడి రక్కినది. అంతలోఁ గుచుమారుఁడు పిలిచినంత నతనిచెంతకుఁ బోయినిలిచినది. వెండియు వాఁడు వ్యాఘ్రమును బెదరించిన నది గాండ్రుమని యఱచుచుఁ గఱవఁబోయినది. ఈరీతి మృగము లెల్ల దిరుగఁబడి వానిం గఱవఁబోయిన వెఱచుచు వాఁడు బారిపోవ ప్రయత్నించెనుగాని దారిలేదు. మృగములే యడ్డముగా నున్నవి. క్రూర సత్వంబులేకాక యశ్వములుగూడ చెంతకుఁబోయినఁ దన్నుచుండెను.

వాఁడు హస్తమెత్తి మహారాజా ! ఈతఁ డెవ్వఁడో ప్రయోగము గావించెను. మృగములు చెప్పినట్లు వినుటలేదు. నే నేమిచేయుదును ? రక్షింపవలయు, నివియే నన్ను భక్షించునట్లున్నవి అని ప్రార్థించెను. అప్పుడు చారాయణుఁడు వానిదాపునకుఁ బోయి యోరీ ! భైరవా ! నన్నెన్నఁడైనఁ జూచితివిరా ! నాముఖముజూచి చెప్పుము. అని యడిగిన వాఁడు గడగడ వడంకుచు నా కేమియు జ్ఞాపకములేదని యుత్తరము జెప్పెను. అల్లనాఁడు సిద్ధునితల రాయితోఁ బగులఁగొట్టితి వదియైన జ్ఞాపకమున్న దా ? అనవుఁడు చాలు చాలు నన్నెవ్వరో యనుకొని భ్రాంతి పడుచుంటివి అని గద్దించెను.

నిన్ను నే నెఱుంగుదును. భైరవుండవు. గురువుంజంపిన మహా