పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

384

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

లీలావతి - ఆహా ! నే నామహానుభావులసేవజేసి యెంతకాల మైనదో తిరుగా నీజన్మమున నా కట్టిభాగ్యము పట్టునా ? అని కన్నీరు విడచుచున్నది.

సరస్వతి - దేవీ ! ఘోటకముఖు లీదినమున మిమ్ముఁ దప్పక భర్తతోఁ గూర్తునని చెప్పలేదా ? మఱచితివా ? మీనిమిత్తమై వారు పడినశ్రమయంతయు వినియుఁ బరితపించెద వేమిటికి ? తప్పక మీకు నేఁడు భర్తృసమాగమము కాఁగలదు.

మదయంతి - అక్కా ! సరస్వతీ ! ఆతఁడే కాళిదాసకవిచంద్రుఁడు. ఆహా ! ఆమహానుభావునికథలం జెప్పికొనుటయేకాని దర్శనము సేసియుండలేదు. నేఁడు కృతార్థులమైతిమిగదా !

సరస్వతి - (భోజకాళిదాసకవుల నిరూపించిచూచి నమస్కరింపుచు) అయ్యిరువురు దేవసదృశులు; త్రిభువనవిఖ్యాతయశులు; నావివాహముతగవులో నానృపతికూడ నుండిరఁట.

రత్న పదిక - మాచరిత్రమంతయుఁ జూడకుండఁగనే రచించిన రహస్యవేది అతఁడే కాళిదాసు అయ్యో ! నాభర్త వారిదర్శనము సేయవలయునని యెంతయో కుతూహలపడువారు. ఎందుండిరో తెలియదు. ఏమిజరగునో అని యశ్రువులు విడుచుచున్నది.

సువర్న పదిక - ఈప్రయత్నమంతయు నందులకే కాదా? సంతోషసమయము వచ్చుచున్నది. విచారింపకుము.

సరస్వతి - మనపండితుల దండితనము వింటిరా? మొన్నటి సభలోఁ గాళిదాసకవితోఁ బ్రసంగించుటకుఁ గాలుదువ్విరఁట.

మదయంతి – అది యౌవనమదము తొలిప్రాయమందుండుటచే నట్టిపంకము గలుగును.

మల్లిక - ప్రసంగించిన నెవ్వరు గెలుతురో ?

లీలావతి - మీభర్త లెంతదిట్టలైనను విద్యామహిమచే నతనికి