పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/388

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదాలసకథ.

379

విని కాశీరా జిట్లనియె. అలర్కా! యుద్ధముచేయకయే రాజ్యము విడిచితి వేమి ? ఇది క్షత్రధర్మమే. క్షత్రియుఁడు మరణభయమును విడిచి శత్రువులపై శరవర్షము గురిపింపవలయుఁగాని పారిపోవనగునా? అని యాక్షేపించిన విని యలర్కుం డిట్లనియె.

నరేంద్రా ! నాకును బూర్వ మిట్టిబుద్ధియే యుండునది. ఇప్పుడు నాచిత్తవృత్తి పూర్తిగా మాఱిపోయినది. నీదాడికి వెఱచి దత్తాత్రేయ మహర్షి చరణంబులు శరణుజొచ్చితిని. ఆమహాత్ముడు నాకుఁ దత్వోపదేశము గావించి నిజం బెఱింగించెను. నాకు శత్రువులు మిత్రులును లేరు. ఇంద్రియముల జయించితి, సంగముల విడిచితిని,

శ్లో॥ సోహం న తెరి ర్నమమాసిశత్రుః సుబాహురప్యేషనమేపకారీ
     దృష్టంమయా సర్వమిదంయధాత్మా హ్యన్విష్యతాంభూపరిపు స్త్స్వయాన్యః॥

భూపా ! నీకు నేనును నాకు నీవును శత్రువులముకాము. సుబాహుఁడు నా కేమియు నపకారము సేయలేదు. నేను నాయాత్మవలెనే బాహ్యప్రపంచకమంతయుం జూచుకొనుచున్నాను. నీవు మఱియొక శత్రువును వెదకికొనుము. అని పలికిన విని విస్మయముచెందుచుఁ గాశీరాజు సుబాహుంజూచి రాజపుత్రా ! మీతమ్ముఁడు రాజ్యము విడిచెను. మనప్రయత్నము కొనసాగినది. పట్టభద్రుండవై ప్రజలం బాలింపుమని పలికిన సుబాహుం డిట్లనియె.

నరేంద్రా ! నే నేపనికై నిన్ను శరణునొందితినో యాపని తీరినది. నాకు రాజ్యమేల? ఇఁక నాకు సెలవిమ్ము పోయివచ్చెద ననిపలికినఁ గాశీపతి నవ్వుచు నిట్లనియె. నీ వేపనికై వచ్చితివి? ఆపని యెట్లుతీరినది? నాకేమియు విడిపోకున్నది. ఎఱిఁగింపు మనవుఁడు సుబాహుం డిట్లనియె. మాతమ్ముఁడు అలర్కుండు మాతల్లిపాలుత్రాగియు విషయసక్తుండై రాజ్యభోగంబుల ననుభవింపుచు నివృత్తిమార్గము దెలియకున్నాఁడని