పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదాలసకథ.

365

మారు లిట్లనిరి.

రాజపుత్రా ! నీవనినట్లుకాక మాకు నీయెడవేఱొక బుద్ధి లేదు. నీ చారిత్రము మేమెఱింగింప మాతండ్రి కువలయాశ్వుఁ జూడవలయు నిందుఁ దీసికొనిరండని పలుమారు చెప్పియున్నాఁడు. అందులకై రమ్మంటిమని పలికినంతఁ గువలయాశ్వుం డాసనమునుండి లేచి తండ్రిగా రేమనిరి? ఓ హెూ ! నే నెంతధన్యుండను. అని యభివాదనము గావించుచు నమ్మహాత్ముండు నన్నుఁ జూడఁగోరెనా ? ఆమాట చెప్పితిరికా రేమి ? తదానతి మనము శిరసావహింపవలసినదే పోదము లెండు వారి యానతి నించుక యువ్యతికరముచేయుట నాతలంపుగాదు. అని పలుకుచు నానాగ కుమాలవెంట నగరాంతిక మందున్న గోమతీనదితీరమున కరిగి వయస్యులారా ! మీయిల్లెందున్నదని యడిగెను.

ఇందేయున్నది రమ్ము అని వా రతనిచేయి పట్టుకొని గోమతిలో మునింగి పాతాళలోకమునకుఁ దీసికొనిపోయిరి. నాగలోకమందు వారివేషములు మాఱినవి. పడగలయందుఁగల మణులచేఁ బ్రకాశింపుచున్న యక్కుమారులఁగాంచి కువలయాశ్వుం డయ్యారే ! మీరూపము లిట్లు మాఱినవేమి ? మీరు నాగకుమారులా ? బ్రాహ్మణులుకారా? అని విస్మయముచెందుచు నడిగిన వారు వయస్యా ! మేము విప్రకుమారులము కాము. అశ్వతరుండను నాగేంద్రుని పుత్రులము. మా తండ్రి దేవతలకుఁగూడ వందనీయుఁడు. చాలప్రజ్ఞ గలవాఁడని యాత్మీయవృత్తాంత మెఱింగించిరి.

రాజపుత్రుఁడు సంతసించుచుఁ బాతాళలోకవిశేషములన్నియుం జూచుచుఁ బోవుచుండెను. బాల్యయౌవనకౌమారప్రాయములతో నొప్పుచున్న నాగకన్యకలు క్రీడించుచుండిరి. వీణావేణుస్వనమనోజ్ఞ మగు గానము వినంబడుచుండెను. వారుమువ్వురు క్రమంబున వీధుల నతిక్రమించి సౌధంబుల దాటి కక్ష్యాంతరంబులు గడిచి యశ్వత