పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదాలసకథ.

363

సూక్ష్మవస్తుజాలమునకెల్ల నీవే ప్రధానురాలవు. నీవలననే సృష్టిస్థితి లయములు జరుగుచున్నవని పలుకుచు సరస్వతి నారాధించుటయుఁ దద్భక్తివిశ్వాసములకు సంతోషించి భాషాదేవి ప్రసన్నురాలై నీ కేమి కావలయునని యడిగిన నాపన్నగేంద్రుఁడు దేవీ ! నాకుఁ గంబళుఁడను మిత్రుఁడు గలఁడు. మాయిరువురకు స్వరసంబంధముగల సంగీతవిద్య యంతయు వచ్చున ట్లనుగ్రహింపుము. అని కోరిన మెచ్చుకొని భాషా దేవి భుజగేంద్రా ! మీ కట్టివిద్య ప్రసాదించితిని. గానకళలో మిమ్ము మించినవారుండరు. మీగానము శ్రోత్రానందముగానుండునని వరంబిచ్చి వాణీదేవి యంతర్ధానము నొందినది. తదనుగ్రహసంప్రాప్త సంగీతవిద్యావిశేషులై శేషకులావతంసుఁడగు కంబళుఁడు నశ్వతరుఁడును మనోహరముగాఁ బాడుచు నొకనాఁడు కైలాసమున కరిగి భవానీ శంకరులు వనవిహారము చేయుచున్నసమయంబున నీగాయకు లిరువురు కంఠములు మేళగించి హాయిగాఁ బాడి యాదంపతుల కత్యంతసంతోషము గలుగఁజేసిరి.

శంకరుఁడు వారిసంగీతము విని మెచ్చికొని దాపునకుఁ బిలిచి మీ కేమికావలయునో కోరికొనుఁడని యడిగిన నశ్వతరుండు మ్రొక్కుచు మహాత్మా ! మదాలసయను గంధర్వపుత్రిక అసత్యభర్తృమరణవార్త విని మృతినొందినది. ఆసుందరిని నాకుఁ బుత్రికగా నుదయించునట్లు చేయవలయును. ఆమె మృతినొందునప్పటి కేప్రాయమం దేరూపున నెట్లుండెనో యట్లే యొప్పుచు జాతిస్మరణ గలిగియుండవలయును. ఇది యే నాకోరికయని తెలిపిన మహేశ్వరుండు నాగేంద్రా ! అట్లే జరగును. వినుము. నీవు పితృపూజ గావించునప్పుడు శుచివై మధ్యపిండమును భక్షింపుము. నీనడుమ పడగనుండి యప్పడఁతి యథారూప ప్రాయముగా నుదయింపఁగలదు. అనిచెప్పినఁ బరమానంద భరితహృదయుఁడై మహేశ్వరునకు నమస్కరించుచు వారిరువురు రసాతలంబున