పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

362

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

యుఁ బితృశుశ్రూషణము నాకు ముఖ్యవిధులు, కావున నే నింతటినుండియు స్త్రీభోగము విడిచెదను. ఇందువలన నాలలనకువచ్చిన లాభము లేదుకాని నాకొఱకుఁ బ్రాణములు విడిచిన యప్పడఁతివిషయమై యీమాత్రమైన కృతజ్ఞత చూపవలదా ? ఇఁక నేపనికిఁ బోక యుదాసీనుండనై యుండెదనని తలంచి భార్యకుఁ దిలోదకములిచ్చి యిట్లు ప్రతిజ్ఞ గావించెను.

“నాప్రియురాలగు మదాలస నానిమిత్తమై ప్రాణములు విడిచినది కావున నే నిఁక నీజన్మమున మఱియొకస్త్రీని వివాహమాడను. సత్యముగాఁ జెప్పుచున్నాను.” అని ప్రతిజ్ఞ జేసి కువలయాశ్వుం డది మొదలు స్త్రీభోగవిముఖములగు పనులు గావింపుచున్నాఁడు. వయస్యులతోఁ గూడికొని శృంగార రహితములగు కృత్యములనే జేయుచున్నాడు. తండ్రీ! అతనికి మన మేమిచ్చినను సంతోషము గలుగదు. అతనిప్రియురాలు మదాలసను దీసికొని యర్పింతుమేని పూర్తిగా సంతోషించును. ఆపని మనకు శక్యముగాదని చెప్పిన విని నవ్వుచు నశ్వతరుం డిట్లనియె.

పుత్రులారా ! ఆశక్యమని యేకార్యమును బ్రయత్నింపక విడువరాదు. శక్యమనియే తలఁచి ప్రయత్నింపవలయును. కర్మఫలము దైవ మందున్నది. దున్నక భూమి ఫలింపదుగదా! నే నందులకుఁ బ్రయత్నించి యమ్మహాత్మున కోపినయుపకారము గావించెదఁ, దపంబునకు సాధ్యముకానిది లేదు, తపంబున విశ్వామిత్రుఁడు సృష్టికిఁ బ్రతిసృష్టి గావించెనని పలుకుచు నప్పుడ బయలుదేరి హిమవద్గిరిపరిసరంబునఁ బ్లక్షావతరణంబను తీర్థంబున సరస్వతీదేవింగూర్చి తపంబు గావించెను.

శ్లో॥ యేర్ధానిత్యాయేచ నశ్యంతిచాన్యె యేర్ధాస్థూలాయేచ సూక్ష్మాతి సూక్ష్మః ।
     యెవాభూమౌ యెంతరిక్షెన్యతోవా తెషాందేవీ! త్వత్త ఏవోపలబ్ధిః ॥

భూమియందు నాకాశమందు నితరస్థలములయందున్న స్థూల