పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదాలసకథ.

361

చుండిరి. పౌరులలీలలు జూచి యతండు డోలాయితహృదయుండై యెవ్వరి నేమియు నడుగక తిన్నగాఁ దండ్రిగారియింటికిఁ జుని జనకుని పాదంబులంబడి నమస్కరించెను.

తండ్రి యతనిం గౌఁగిలించుకొని కన్నీటిచే శిరంబుదడుపుచు గద్గదకఠముతోఁ జిరంజీవ ! అని యాశీర్వదించెను. తల్లియు బంధువులు శోకమును వెలిపుచ్చుచు నాతని నాశీర్వదించిరి. అందున్న వారెల్లఁ దన్ను వింతగాఁ జూచుచుండ రాజకుమారుండు వెఱఁగుపడుచుఁ దండ్రీ! నేఁడు నన్ను మీరందఱు క్రొత్తగాఁ జూచుచున్నా రేమి ? విశేషము లేమైనం జరగినవియా ? నాప్రాణనాయకి మదాలస సేమముగా నున్నదా ? అని యడిగిన దుఃఖించుచు రాజు పుత్రున కా తెఱంగంతయు నెఱింగించెను.

రెండుగడియ లేమియు మాటాడక స్థబ్ధుడై కన్నులుమూసికొని పిమ్మట నిట్లుతలంచెను. ఆహా ! ఆమహాసాధ్వి నామరణము వినినతోడనే ప్రాణములు విడిచినది. నాకతంబున మృతినొందిన యాసతీమణి వార్తవిని నే నిట్లే బ్రతికియుంటి. నాకంటెఁ గృతఘ్నుం డెందైనం గలఁడా ? నేను గ్రూరుఁడ ననార్యుఁడఁ బాపాత్ముండ దయాశూన్యుఁడ నని పెద్దగా నిందించుకొని యాసుందరిం దలంచుకొని దుఃఖించుచు మనంబును దృఢపఱచుకొని మోహమును విడిచి వేడినిట్టూర్పు నిగుడింపుచు నిట్లుతలంచెను. నానిమిత్తమై యమ్మత్తకాశిని దేహమును బాసినదని తలంచి నేనును సమసెదంగాక, దాన నామెకు వచ్చెడు లాభ మేమి యున్న ది ? అది స్త్రీలకు యశస్కరము కాని పురుషులకుఁ గాదు. అట్లు చేసితినేని లోకులు నిందింతురు. హా ! ప్రియా ! హా ! ప్రియా ! అని దెసలు ప్రతిధ్వను లిచ్చునట్లు ప్రతిదినము రోదనము చేసేదంగాక. అదియు నపకీర్తిహేతువే. సజ్జనులు నన్నుఁజూచి నవ్వకమానరు. పోనీ శోకజడుండనై దీనుండనై సిగ్గువిడిచి మలినాంగుఁడనై వెఱ్ఱివాఁడుంబోలెఁ దిరుగుదమన్న శత్రువులు లోకువసేసి పరిభవింతురు. శత్రువధ