పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కౌశికునికథ.

349

ఎవ్వరికిని విధింపను. విషముగలిపినపెరుఁగును బరిశీలింపకుండ నాసన్యాసికిఁబోసిన యజమానుఁడే యాపాపము భరింపవలయును. వస్తుశోధనము సేయవలదా? గరుడపక్షి యించుకయు భరింపనర్హము గాదని కచ్చితముగాఁ జెప్పెను. విధివశంబున నామాట లాకసంబున నాప్రాంతముగాఁబోవుచున్న యమదూతలు విని యాపాఱుం బట్టికొని యమునియొద్దకుం దీసికొనిపోయి యతం డాడినమాటల నివేదించిరి.

అప్పుడు యముఁడు తిరుగా నీవట్లుచెప్పితివా? అనియడుగుటయుఁ జెప్పితిని. అట్లుచేయుటయే విధియని నిర్భయముగాఁ బలికెను. అప్పు డాధర్మరాజు దధిపూర్ణఘటంబుల రెంటిఁ దెప్పించి యొకదానిలో గరళముగలిపించి చూపి వీనితారతమ్యము చెప్పుము. దేనిలో విషముగలిపితిమో యెఱిఁగింపుమని యడిగిన నాబ్రాహ్మణుఁడు చూచి చూచి తెల్లపోయి సత్యము చెప్పలేకపోయెను.

అప్పుడు యముండు వానిపై నలుగుచు ధర్మసూక్ష్మము గ్రహించుట కష్టము. తెలియనప్పుడు ఇదమిద్ధమని నిరూపింపరాదు. అసత్యముగా దోషారోపణము జేసినవాఁడు తత్ఫలం బనుభవింప వలసియున్న ది. కావున పారుఁడా ! నీవుసెప్పినది యసత్యమైనది. తత్ఫలంబు నీ వనుభవింపుము. నీకు విధించితినని పలుకుచుండఁగనే యమదూత లతని నిరయంబునకుఁ దీసికొనిపోయి యాఫలము గుడిపించిరఁట.

ప్రాణేశ్వరా ! ధర్మ మింతసూక్ష్మములో నున్నది. నిష్కారణ మాఁడువాండ్ర బాధించినపాతకము మీరుగూడఁ బంచికొందురేమో యని వెఱచుచున్నాను. అని మిత్రవింద చెప్పినయుపన్యాసము విని రాజు మందహాసము గావించుచు నిట్లనియె.

శ్లో॥ శోకారాతి పరిత్రాణం ప్రీతి విస్రంభభాజనం
     కేనరత్న మిదంసృష్టం మిత్రమిత్యక్షరద్వయం ॥

సాధ్వీ ! మిత్రకార్య మెట్టిదైనను దీర్పవలయునని శాస్త్రములు