పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కౌశికునికథ.

347

పెరుఁగుముంతలోఁ బడినది. ఆవిషయ మించుకయు గొల్లది యెఱుంగదు. ఆ పెరుఁగుముంత కౌశికుఁ డందుకొనిచాల సంతోషించుచు దాని కెక్కువగా సొమ్మిచ్చి తరువాత యథాశాస్త్రముగా నాసన్యాసి నర్చించి పిండివంటలతో భోజనముపెట్టెను. కడపట నాపెరుఁగు వడ్డించెను. దానిరుచికి మెచ్చుచు యతీశ్వరుఁడు మఱికొంచె మెక్కువగాఁ బుచ్చుకొనియెను. అతనినాలుక పూచియుండుటచేఁ బుండుపడియున్నది. భుజించినకొంచెముసేపునకే యాయతి విషముఘాటుతగిలి పరమపదించెను.

యతిచావు జూచి గృహపతి యపరిమితముగా దుఃఖించుచుఁ దత్కారణము దెలియక పరిపరిగతులఁ దలంచుచు గ్రామస్థులసహాయమునఁ దద్దేహము గంగార్పితముగావించెను. ఆయతిహత్యాపాతకము నెవరనుభవించునట్లు వ్రాయవలయునో తెలియక సంశయించుచుఁ జిత్రగుప్తులు యమధర్మరాజు సడిగిరి. అతం డావిషయము విమర్శించి సందియమందుచు ధర్మకర్తల నడిగెను.

ధర్మకర్తలు తత్పాపభర్తలగుఱించి వితర్కించి కౌశికుండు శ్రోత్రియుఁడు. శ్రద్దాభక్తిపూర్వకముగా యతిభిక్ష గావించెను. గొల్లది తెచ్చినపెరుఁగులో విషముగలిసిన ట్లెట్లుతెలిసికొనఁగలఁడు ? కావున నతని కీపాపము విధించుట యుచితముగాదు. గొల్లది కులోచితాచార ప్రకారము తోడుపెట్టి మూతవైచి తట్టలోఁబెట్టి పెరుఁగు తీసికొనివచ్చినది. గుడ్డ గాలిచేఁ గదలి యెగురుట యెఱుఁగదుగదా ! ఇందు దానిలోప మేమియున్న ది. చెప్పినరీతిగాఁ దెచ్చియిచ్చుటచే నీపాపము గొల్లదానికి విధించుట యుక్తముగాదు.

ఆచ్ఛాదనవస్త్రమును ముంతమూతినుండి కదిల్చినవాయువున కీయఘము విధింతమన్నఁ జలన మతనికి సహజము. కావున నట్లుచేయుట తప్పు. విషముగ్రక్కిన సర్పమునకే యీదోష మర్నింతమన్న గరుడ పక్షిచేత నొక్కఁబడి యది యట్లు చేసినది. అస్వతంత్రుఁడు పాపభర్త