పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఘోటకముఖునికథ.

345

యిరువుర వారవనితల బలవంతమునఁ జెఱపట్టితివఁట. అది యెంతపాపము. సీతను జెఱపట్టిన రావణుం డేమయ్యెనో యెఱుంగుదువా ? నీవీజాబు చూచినతక్షణము వేశ్యాపుత్రికల నిరువురను విడిచివేయుము. అట్లు వెంట నే మాకుఁ దెలియఁజేయుము. నీసదుత్తరము రానిచో నుత్తర కాలమందే నీపై యుద్దము బ్రకటించుచున్నాము. నీరాజ్య మన్యాక్రాంతము గావింతుము. అని జాబువ్రాసి విపులునొద్ద కనిపెనఁట. విపులుఁడు భోజునికంటె దుర్బలుఁడగుట నాపత్రికం జదివికొని భయపడుచుఁ బ్రత్యుత్తర మిట్లు వ్రాసి పంపించెనఁట.

మహారాజా ! నాశత్రువు లెవ్వరో మీకట్టివార్త తెలియపఱచి యున్నారు. వేశ్యాపుత్రికల నిరువుర నే నెన్నఁడును దీసికొనిరాలేదు. వారు నాదేశములో లేరు. మీకు నామాటయందు విశ్వాసములేనిచో మీదూతలం బంపి వెదకింపుఁడు. అట్టివేశ్యలు నావిషయమం దెందున్నను మీరుచేసినశిక్షకుఁ బాత్రుండనగుదును. అని భోజునకుఁ దెలియఁజేసి వెంటనే యతండు నాకు వర్తమానముసేసెను.

నేనుబోయి పనియేమని యడిగిన జరగినకథయంతయుం దెలియఁ జేయుచు నేను మతంగయోగి మూలమున బలవంతముగా నిరువురగణికాపుత్రికలఁ జెఱదెచ్చినమాట వాస్తవము. గడిచినదానికి వగచినఁ బ్రయోజనములేదు. ఇప్పుడు వీరినివిడిచితినేని నాయక్రమకార్యము వెల్లడికాకమానదు. వెలయాండ్రుగదా? యని రప్పించితిని. వాండ్రు కులస్త్రీలకన్న నెక్కుడుపరితాపము చెందుచున్నారు. కావున వారు వీరిని మీదేశమునకుఁ దీసికొనిపోయి కొన్నిదినములు కాపాడవలయును. ప్రస్తుతోపద్రవము దాటినపిమ్మటఁ గర్తవ్య మాలోచింతముగాక. నీవు నాకు మిత్రుఁడవు. ఈసమయంబున నీయుపకారము గావింపుము. నీకడ నుండినచోఁ బరమేశ్వరుఁడు దెలిసికొనఁజూలఁడు అని ప్రార్థించెను.

అక్రమమైనను మిత్రునికార్యము సేయఁదగినదని తలంచి యతని