పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఘోటకముఖునికథ.

343

రని చెప్పినది. జాంబవతికి వివాహ మెక్కడనైనఁ గుదిరినదియా ? ఈ యేఁడు చేయుతలంపు గలదా? అనియడిగిన నామె యుక్తవయసువచ్చినది. చేయ కేమి ? తగినవరుఁడు కనంబడుటలేదు. పలుచోటులు చూచిరి. విద్యయుండిన రూపములేదు. రూపమున్న విద్య సున్న. ధనముతో మనకుఁ బనిలేదు. అని యావిషయముగుఱించి ముచ్చటించుకొనిరి. తరువాత నేదియో గుజగుజలాడుచు న న్నాయవ్వ లోపలికిఁ దీసికొనిపోయినది.

అంతలో భోజనమునకు లెమ్మని పరిజనులు వచ్చి చెప్పిరి. పలురకముల పిండివంటలతో నే నారాత్రి భోజనముసేసితిని. రాజోపచారములు గావించిరి. హంసతూలికాతల్పంబునం బండుకొన నియమించిరి. నామంచముదాపునఁ గూర్చుండి యాయవ్వ యిష్టాలాపముల నాడుచుండ నారాత్రి సుఖముగా వెళ్లించితిని.

మఱునాఁడు మంగళగీతములచే మేల్కొంటిని. పరిజను లనేకోపచారములు సేయుచుండిరి. అంతలో నవ్వవచ్చి కుశలప్రశ్న చేయుచు మాయల్లుఁడు నేఁటిమధ్యాహ్నమునకే వత్తుఁరట. ఇప్పుడే వార్తవచ్చినది నామనుమరాలిఁ జూచితిరా ? జాంబవతీ ! ఇటురా. అనిపలుకుచు నొక చిన్నదానిం బిలిచినది. అప్పు డొకబాలిక యచ్చరమచ్చెకంటిపోలిక నొప్పుచు నాప్రక్కవచ్చి నిలువంబడినది. తద్రూపాతిశయంబు నాకు మోహాతిరేకము కలుగఁ జేసినది. తదవయవంబులన్నియు సాముద్రికశాస్త్రలక్షణలక్షితంబులైనవి. తత్సౌందర్యవిశేషంబు పరిశీలింపుచుండ నా యవ్వ మనుమరాలితో జాంబవతీ ! ఆయన మంచిపండితుఁడు నమస్క,రించుము. అనుటయు నాబాలిక చేతులెత్తి మ్రొక్కినది. అనుకూలభర్తృ లాభసిద్ధిరస్తు అని యాశీర్వదించితిని. ముసిముసి నగవులు నవ్వుచు నా బాలిక యవ్వలికిఁ బోయినది.

ఇంతలో గ్రామాంతరమునుండి యొడయం డరుదెంచెను. మిత్ర