పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

342

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

చేసి యోడ యెక్కి తిమి. ప్రొద్దుక్రుంకకపూర్వమే యవ్వలియొడ్డు చేరితిని, వెంటనే యొకబండియెక్కి వరాహపురమున కరిగితిమి. ఆనగరము మహోన్నతములగు సౌధములచేతను సమస్తవస్తుపూర్ణ ములగు విఫణి మార్గములచేతను బ్రకాశింపుచున్నది. రాజమార్గంబునఁ బోయిపోయి రాజుగారికోట చేతిమి. ఆయవ్వ నందఱు నెఱింగినవారగుట దౌవారికు లేమియు నాటంకము సెప్పలేదు. కక్ష్యాంతరములు గడిచి తిన్నగా లోపలి భవనమునకుం బోయితిమి. తల్లివచ్చుచున్నదనువార్త విని పుత్రిక మిత్రవింద కొంతదూర మెదురువచ్చినది. ఆమె నన్నుజూచి యించుక తొలఁగిన వలదు వలదు. ఈయన మన కాంతరంగిక బంధువుఁడు. అర్చనీయుఁడు. పాద్యము దెమ్మని పలుకుచు నాయవ్వ కుమారితచేత నా కుపచారములు చేయించినది.

నా కించుకమాటుగా నిలువంబడి మిత్రవింద అమ్మా ! యింత వేగిరము వచ్చితివేమి ? రెండు నెలలవఱకు రావనుకొన్నాము వారెవ్వరు? అనియడిగిన నామె పుత్రికతో భైరవుండు తనయడవికి వచ్చుటయుఁ దన్ను గుఱ్ఱముగాఁ జేయుటయు నేను విడిపించుటయు లోనగువృత్తాంతమంతయు నెఱింగించినది. మిత్రవింద యురముపైఁ జేయి వైచికొనుచు హా! హంత ! యెంతగండము గడిచినది ? నే నేమిచేయుదును. నీవు చెప్పినమాట వినవు. నీ కా యడవిలోనే చావుమూడినది. ఇట్టి యైశ్వర్య మనుభవించుచున్న ను నాబుద్ధికి స్థిమితము లేదు. నీకొఱకే చింతించు చుందును. నిన్ను వాఁడు గుఱ్ఱముగాఁ జేసెనుగాని, చంపిన నేమిచేయుదువు ? వలదనువారెవ్వరు ? ఇప్పుడైన బుద్ధిగలిగి యాకాపుర మెత్తి పెట్టి యిక్కడికి రమ్ము. అని యేమేయో మందలించినది.

అవ్వ పుత్రికమాటలు విని కానిమ్ము. ఏదోయొకటి చేయుదము. నీభర్త యూరనున్నాఁడా? అనియడిగిన పుత్రిక లేరు. వారిమిత్రుఁడు విపులుఁడు వర్తమానముసేయ మహాపురంబున కరిగిరి. ఱేపు రాఁగల