పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఘోటకముఖునికథ.

339

అవ్వా! ! నీయల్లుఁడు రాజుగదా ? నీ వావరాహపురంబున కరిగి యందు సుఖింపక యిం దొంటిగా నుండనేమిటికి ? అని యడిగిన నామె బాబూ ! చెప్పలేదా ? నాపశుబలము జూతువుగాని రమ్ము, నా దొడ్డి యీప్రాంతమందే యున్నది అని పలుకుచు నన్ను వెంటఁబెట్టికొని యచ్చటి కనతిదూరములో నున్న మందలోనికిఁ దీసికొనిపోయినది.

ఆమెంజూచి యందున్న పెద్దపెద్దయావులు దూడలు గిత్తలు అంభారవంబులు గావింపుచు దాపునకువచ్చి యామెను నాకుచు ముట్టెలతోఁ బొడుచుచు వియోగశోకమును వెలిబుచ్చినవి. ఆమెయు వాని నెల్ల గోకుచు ముద్దుపెట్టుకొనుచుఁ గొన్నిటిఁ బేరులుపెట్టి పిలుచుచు దాపునకు రప్పించుకొని కొన్నిటి పొమ్మని పేరులతోఁ జెప్పిన దూరముగాఁ బోయినవి. ఆవింత నాకుఁ జూపుచు నాయవ్వ బాబూ ! ఈ పశుమోహమే నన్నిచ్చటినుండి కదలనీయకున్నది. వీనిఁ బిల్లలగాఁ జూచుకొనుచున్నానని చెప్పినది.

అప్పుడు నేను అవ్వా ! నీమాట సత్యమే. పశుపత్నిసుతాలయములు ఋణానుబంధరూపములని పెద్దలు చెప్పుచుందురు. పోనీ నీయల్లుఁడు భాగ్యవంతుఁడుగదా? ఇం దీగుడిసె దీసి మంచియిల్లు గట్టికొన రోదా ? అని యడిగిన నామె నాచేయిపట్టికొని తన గుడిసెయొద్దకుఁ దీసికొనిపోయి దానిలో నొకమూలఁ జాటుగా నమరింపఁబడియున్న చిన్నతలుపు తీసి నేలసొరంగము జూపినది. దానిలోనికి దిగితిని. ఆహా ! లోపల మిక్కిలి విశాలముగానున్నది. ఇంద్రభవనమువలె విరాజిల్లుచున్నది. వింతవింతవస్తువులు గలవు.

వాని వాని వేఱు వేఱ నిరూపించి చూపుచు నార్యా ! ఇది మహారణ్యప్రదేశ మగుటయు నొంటిగా నుండుటంబట్టి వట్టి పేదదాని వలెఁ గనంబడుదును ఈగుడిసెజూచి నాజోలి కెవ్వరును రారు. నాపశు ధన మెవ్వరు దీసికొనిపోవఁజాలరు. బలవంతమునఁగాని దొంగతనమునఁ