పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

338

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

మేయుచున్నవి. కావున నొకటిరెండుదినములకంటె మీరిందుండఁదగదు. అని వినయముతోఁ బ్రార్థించినఁ గన్నులెఱ్ఱజేయుచు నాజటాధారి నన్నుఁ జూచి యోసీ! అడవి యొకరు పెంచినదికాదు. అందఱకు సమానమగు నధికారము గలిగియున్నది. నాశక్తి యెఱుంగక యిట్టు పలుకుచున్నావు. నే నిందు నాయిష్టమువచ్చినన్నిదినము లుందు వలదనుటకు నీవెవ్వతె వని గద్దించి పలికెను.

అప్పుడు నేను మెల్లఁగా స్వామి ! యీయరణ్యముపై మీ కథికారము గలిగియున్న చో మీపశువులపై మృగములపై నా కధికారము గలిగియున్నదని చెప్పిన మీకుఁ గోపమువచ్చునేమో? భగవత్సృష్టి యందఱకు సమానముగదా? అని ప్రత్యుత్తరమిచ్చి తిని. అప్పు డాయనకు నాపైఁ బెద్దకోపము వచ్చినది. ఏదియో పసరు నానెత్తిపై రుద్ది నన్నొక గుఱ్ఱముగాఁ జేసెను. తరువాతిచర్యలన్నియు స్వప్నప్రాయములుగా నున్నవి. ఇంచుకించుక తెలివితో వానిబారి తప్పించుకొనివచ్చి పారిపోవుదమని ప్రయత్నించుచుండఁగా నింతలో మీరువచ్చి నన్నిక్కడికిఁ దీసికొనివచ్చితిరి. మీకరుణావిశేషంబునంజేసి స్వస్వరూపము గైకొంటి లేనిచో వారువమనై యుండవలసివచ్చును. కృతార్థురాలనైతి నిదియే నావృత్తాంతమని యెఱింగించిన విని నే నాశ్చర్యమందుచు నవ్వా ! వాఁడు మహాపాపాత్ముఁడు. స్త్రీలను జెఱపెట్టుట కించుకయు వెఱవఁడు. ఒక పతివ్రత నట్లే కావించెను. వానినిమిత్తమే తిరుగుచుంటిమి. నామిత్రునిగూడ నిట్లే కావించెనుకాఁబోలు. న న్నవమానించునని మాటునకుఁ బోయితిని నీమూలమున నతనిచేతఁ జిక్కకుండ నిందు రాఁ గలిగితిని. ఆక్రూరుండు ఇంక నెందఱను బరిభవించునో తెలియదు. పాపము నామిత్రుఁడు వాని తాంత్రికమెఱుంగక చిక్కుకొనియెను. శూరుల కెఱింగించి వాని శిక్షింపఁజేసెద. వాని చేష్టలు తెల్లమైనవని పలుకుచు మఱియు నిట్లంటిని.