పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

వాండ్ర నింటికిం బంపివేసి తానాయరణ్యమంతయుఁ దిరుగుచునమ్మదవతిని వెదక మొదలు పెట్టెను. హా ప్రేయసీ! యని కేకలుపెట్టుచుఁ దొల్లి శ్రీరాముండు సీతను గుఱించి పలవరించినట్లు పరితపించుచు నమ్మించుఁబోఁడి బలవన్మరణము నొందినట్లు నిశ్చయించియొక్క చెట్టు క్రిందఁ జదికిలంబడి తలంచెను.

అయ్యో ! పరమపతివ్రతా శిరోమణియగునిల్లాలింజంపించితిని మహానుభావుండై న కాళిదాసు నవమానించితిని. వారిర్వురు నిర్దోషులని యిప్పుడు నాహృదయమే చెప్పుచున్నది. నేను మహాపాతకుఁడ నైతిని. నాకీ పాపమెట్లుపోవును. నాకు నిష్కృతిగలదా? ప్రాయోపవిష్టుండనై ప్రాణంబుల విడిచెదను. అని కృతనిశ్చయుండై యాచెట్టు క్రిందఁ గూర్చుండి నలుమూలలు చూచుచుండ నుత్తరపుఁ దెసనుండి యొక బాహ్మణుఁ డాచెట్టుక్రిందికే యరుదెంచి యాతపక్లేశము నివారించుకొనఁ జెమ్మట లార్చుకొనుచు నందున్న యారాజుంజూచి వెఱుఁగుపడుచుఁ బల్కరించుటకు వెఱచి యూరక యాతనివంక చూచుచుండెను.

అప్పుడు భోజుం డతనింజూచి దీనస్వరముతోఅయ్యా! మీదే యూరు ! ఎందుఁబోవుచున్నారు? అని యడిగిన నతం డిట్లనియె. నేనొకబ్రాహ్మణుండను. నాపేరు ఘోటకముఖుఁడందురు. భోజ మహారాజుగారిం జూడ ధానగరంబున కరుగుచున్నవాఁడను. కాశీలోఁ జదివితినని తనవృత్తాంత మంతయును జెప్పెను.

ఆమాటలువిని రాజు నమస్కరించుచు నార్యా ! భోజునితో మీకేమిపనియున్నది? అని యడిగిన సౌమ్యా! అతండు పండితకల్పఁ భూజుండని కాశీలో విని మే మేడ్వురము సహాధ్యాయులము వారిం దర్శింప నిశ్చయించి వేఱువేఱుమార్గములనాయూరికిఁ బోవుచుంటిమి. నామిత్రు లీపాటికి తత్పురంబునకుఁ బోయియుందురు. నాకు దారిలో