పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజుని కథ.

23

    క్రూరసత్వంబులుక్కున మీఁదబడి యొడ
                    ల్విదలించునని పలవింపనేను

గీ. ఎప్పుడో చావునిక్కంబె యెఱిఁగిచూడ
    నస్థిరంబులె దేహసౌఖ్యములు దెలియ
    “దుష్టనని” కానఁద్రోసినందులకు మిగుల
    వగతుఁజింతింతు విలపింతు వనటఁగాంతు.

శా. మీపాదంబులె నమ్మి దైవమని మిమ్మేకొల్తు నెల్లప్పుడే
     నేపాపంబునెఱుఁగ భూతనివహంబే సాక్షియోనాథ! నా
     కీపైవచ్చెడు జన్మజన్మముల కీరే భర్తలై సత్కృపం
     గాపాడన్ ఘటియింపు మంచెద జగత్కర్తం బ్రశంసించెదన్ .

ఆపద్యములం జదివికొని యతండు నేలంబడి మూర్ఛిల్లి యొక్కింత తడవునకుఁ దెప్పిరిల్లి యున్మత్తవికారముతో ఓఋఈ ! మీరా మెందీసికొనిపోయి యెన్నిదినములైనది యెఱింగిపుఁడని యడిగినవాండ్రుదేవా ! పదియేనుదినంబులైనదని చెప్పిరి. ఏమీ? ఇంతియే? నాకు యుగాంతరములై నట్లున్నది. కానిండు నేనాయడవికి వచ్చెద నాప్రియ యురాలినెందు విడిచితిరో చూపింపుఁడని పలుకుచు నెవ్వరికిఁ జెప్పక యశ్వశాలకుఁబోయి యొకగుఱ్ఱమునకు జీను గట్టించి యెక్కి వాండ్రవెంట నమ్మహారణ్యమున కఱిగెను.

ఆదూతలు మహారాజా! ఇందాందోళికమును దింపితిమి. ఇందు మీశాసన మెఱింగించితిమి. ఇందు దుఃఖించినది. ఇందు మీకు పద్యములు వాసియిచ్చినదని యాయాగురుతు లెఱింగించుచుఁ దచ్ఛాస నంబున నక్కాననంబంతయు నామెను వెదకిరి. ఎందు నామె జాడ కనంబడినదికాదు.

అప్పుడా ఱేఁడు మిక్కిలి పరితపించుచుఁ దాను వచ్చుదనుక రాజకార్యములనెల్ల మంత్రులఁ జక్క బెట్టుఁడని శాసనము వ్రాసియిచ్చి