పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కసు కథ.

331

కొన్నిదినములుమాత్రము నాయొద్దనుండి తరువాతఁ గనంబడలేదు. ఎందుఁబోయెనో తెలియదు. గోణికాపుత్రుఁ డందుల కే విచారించుచున్నాఁడు. అని యతనిగుఱించి ప్రస్తాపించెను గోణికాపుత్రుండు చిత్రసేనునితో మిత్రమా ! విపులునొద్దనుంచి , ప్రత్యుత్తరమువచ్చినదా ? గణికాపుత్రికలవార్త లేమైనం దెలిసినవియా? విపులుఁడు గావించిన దుర్నయమునకుఁ బ్రతిక్రియఁ జేసితీరవలయు. నామిత్రులు గోనర్దీయ కుచుమారులు చెరియొకదేశమునకు నధికారులు చతురంగబలములతోఁ బోయి వాని బంధించిరాఁగలరు అనిచెప్పిన రాజపుత్రుం డౌను ప్రత్యుత్తరము వచ్చినది. నీకుఁ జెప్పలేదుకాఁబోలు నీసందడిలో మఱచితిని. వినుము.

మనము వ్రాసినపత్రికకు జడుపుజెందుచు నత్యంతవినయముతోఁ బ్రత్యుత్తరమిచ్చెను. ఆగణికాపుత్రిక లెవ్వరో తానెఱుఁగఁడఁట. తనదేశమం దెచ్చటనున్నను జూపినచో మనముసేసినశిక్షకు బాధ్యుఁడగునఁట. వచ్చి వెదకికొనుమని వ్రాసెను. ఆవెంటనే కొందఱదూతల నందుఁ బంపితినని యావృత్తాంతము చెప్పెను.

గోణికాపుత్రుండు ప్రస్తావముమీఁద మీతల్లి లీలావతి యిందున్నదని చెప్పుటయు నతండు వెఱఁగుపాటుతో మాతల్లి లీలావతియే ! యెట్లువచ్చినది? బ్రతికియున్న దా? అనియడుగుచుఁ దనకుఁ జూపుమని కోరికొనియెను. స్త్రీసంఘమధ్యంబున నుండుటచే నప్పుడు పోవుటకు సమయముకాదని సువర్ణ నాభుఁడు చెప్పెను. మఱునాఁడైనను జూపింపకతప్పదని బ్రతిమాలికొని రాజపుత్రుం డింటికిఁ బోయెను. వా రట్లు పెద్దతడవు ముచ్చటలాడికొనుచు నాదివసము వెళ్లించిరి.

అని యెఱింగించునంతఁ గాలాతీతమైనది. తరువాతికథ పైమజలీయం దిట్లు చెప్పఁదొడంగెను.


____________