పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

330

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

యంబులంబట్టి రుక్మిణీచిత్రసేనుల చారిత్రములు కళంకపాత్రములైనట్లు నిశ్చయించుకొని చిరాకుపడఁజొచ్చెను. మంచముపైఁ బండుకొని ధ్యానించుచుండ ననేకవిషయములు జ్ఞాపకము వచ్చినవి. అంతలో నిద్ర బోయెను.

గోనర్దీయాదిమిత్రులు గోణికాపుత్రునితోఁ గూడికొని తమ విడిదలకుం బోయిరి. గోణికాపుత్రుండు వారివారి చరిత్రముల విని విస్మయసంతోషంబులు వెల్లివిరియ దత్తునిగుఱించి తా నెఱింగినకథయంతయుఁ జెప్పెను. దత్తుఁడు యక్షశాపంబున స్త్రీరూపమ వహించియున్నవాఁడు. ఇందో యెందో వెదకి వానిం దెలిసికొననలసియున్నది. యక్షుండు వానిశాపము గ్రమ్మఱింపఁగలఁడని సువర్ణ నాభుడు పలికెను.

యక్షుండు భైరవశిక్షితుండైనట్లు చెప్పితివిగదా. ఆమాటయే నిక్కమైనచో నిప్పుడేపోయి యాభైరవునిఁ బరిభవింతము రండు. రేపటి వఱకు నిలువనేల ? తృటిలో వానిం బంధించెదనని కుచుమారుండు పలికిన గోనర్దీయుండు తొందరవలదు. వానియాట జూచి సమయోచితముగాఁ గావింతముగాక. ఘోటకముఖునిమాట యేమి ? రాజు తన కేమియుఁ దెలియదనుచున్నాఁడు. వాఁడుగూడ వినిచేతఁ జిక్క లేదుగదా? అనుటయు నన్నియు రేపు తేలునుకాదా? తొందరవలదని గోణికాపుత్రుఁడు చెప్పెను.

వా రట్లు మాట్లాడుకొనుచుండఁగాఁ జత్రసేనుఁడు శకటమెక్కి యక్కడికివచ్చి దౌవారికునివలనఁ దనరాక గోణికాపుత్రునకుఁ దెలియఁజేసెను. గోణికాపుత్రుఁడు తొందరగా ద్వారదేశమున కెదురువోయి రాజపుత్రుం కోడ్తెచ్చి యుచితాసనాసీనుం గావింపుచుఁ దమ తమమిత్రులకథయంతయుం జెప్పి యన్యోన్యమైత్రి గలుగఁజేసెను.

రాజపుత్రుఁడు వారినెల్ల నగ్గించుచు నే నిదివఱకు దత్తుని నీగోణికాపుత్రుని నెఱుంగుదును. మీచరితములు వీరివలన వింటిని. దత్తుఁడు