పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కసు కథ.

329

త్రుండు ఘోటకముఖుండు వచ్చెంగదా? అతఁ డిందు రాలేదేమి ? ఎందైనం బంపితిరా? అతఁడును దత్తకుఁడునుందక్క తక్కినవారము గలిసికొంటిమి. వానివృత్తాంత మెఱింగిపుఁడని యడిగిన నయ్యొడయండు స్మృతినభినయించుచు నయ్యో అప్పరమపవిత్రు స్నేహపాత్రుఁ బరార్థపరు నీసభలో స్మరింపక నేను గృతఘ్నుండ నైతింగదా? (జనాంతికముగా) నొకపాపాత్మునిమూలమున నేను స్మృతిచెడి రూపాంతరము వహించియుండిన నాతం డెందుఁబోయెనో తెలిసికొనలేకపోయితిని. అప్పుణ్యాత్ముం డెందుఁ జిక్కు పడియెనో తెలియదు. ఈపాటి కీవీఁటికి రావలసినవాఁడే యని విచారము సూచించెను.

అప్పుడు సువర్ణ నాభుండు రహస్యముగా మహారాజా ! మృగ సమూహములతో వినోదములఁ జూపుటకై వచ్చి మీతోటలో విడిసిన భైరవుండు కడుదుర్మార్గుఁడు, గురుద్రోహి. మనుష్యులఁ బశుపక్షిమృగాదులఁ గావించి వంచించుచున్నాఁడు. వానియొద్దనున్న జతువులన్నియు నట్టివే. మాకుచుమారుఁడు వానిం బరిభవింపఁగలఁడు. మీరు వాని మృగవినోదములఁ జూచుటకై ప్రత్యేకము రప్పించితిరి. తత్పరిభవము మీ కసమ్మతమేమోయుని తలంచి చెప్పుచుంటిమి. మాయాప్తులఁ బెక్కండ్రఁ బక్షులనో మృగములనో చేసి త్రిప్పుచున్నాఁడు. వానిని శిక్షించి వానియొద్దనున్న పశుపక్షి మృగంబుల వశపఱచుకొనవలయునని తెలిపిన విని భోజుండు వానిచరిత్రము మీకునుం దెలియునా ? అందఱ కన్న నన్నెక్కుడుగాఁ బరాభవించెను. వానిని శిక్షించుటకే యిందు రప్పించితిని. వానియాటనాఁడు మన మందులకుఁ దగినప్రతీకారము యోజింతము. ఇప్పుడు వెల్లడింపకుఁడు. పారిపోవఁగలడు. అని పలుకుచు నప్పటికిఁ జాలప్రొద్దుపోవుటచే వారినెల్ల సగౌరవముగా విడిదల కనిపి తా నంతఃపురమున కరిగెను. అందుఁ గ్రమ్మఱ లీలావతీవియోగ విషాదంబు హృదయంబున నావేశించినది. ప్రధానుం డెఱింగించినవిష