పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కసు కథ.

323

ముట్ట పరస్పరాలింగితాంగులై సంతోషబాష్పస్థంభితగద్గిదికకంఠులై యొక్కింతతడ వేమియు మాటాడనేరక యెట్ట కేఁ దెమల్చుకొని సుఖాసనోపవిష్టులై ప్రహర్షమును బ్రకటించిరి. అప్పుడు కుచుమారుండు మిత్రమా సువర్ణనాభా ! నీ వుత్తరదేశారణ్యముల తుదిఁజూచి వచ్చితివా? అందు విశేషములేమైనం గనంబడినవా? ఈచారాయణుతో నెందుఁ గలిసికొంటివి? ఇం దెప్పుడువచ్చితిరి? యెఱింగింపుఁడని యడిగిన సంక్షేపముగాఁ దమవృత్తాంతము జెప్పుచు మీ రీప్రభుత్వ మెట్లుసంపాదించితిరని యడిగిన వారును దమకథనంతయు నెఱింగించిరి.

అప్పుడు సువర్ణనాభుండు మిత్రులారా ! మనస్నేహితులలో దత్తుఁడును ఘోటకముఖుడునుందక్క తక్కినవారమందఱమునిందుఁ జేరితిమి. గౌణికాపుత్రుండు రాజపుత్రునకు మిత్రుండై వర్తించుచున్నట్లు నిన్నసభలో మీరును జూచియేయుందురు. మనయందఱకన్న ముందే దత్తుఁ డీపత్తనంబుఁ బ్రవేశించినాఁడు. వెనుక నే నతనితోఁ గలిసికొని మాట్లాడితిని. ఆక్షణమందే యెందోబోయి తిరుగాఁ గనంబడలేదు. యక్షశాపోపహతి యువతియై యతండు పరిభ్రమించుచుండవలెను. వారిరువురజాడయే మన మెఱుంగవలసియున్నది. మఱియు మనకుఁ బరమోపకారియైన యక్షుండు భైరవశిక్షితుం డైనట్లు తలంచుచుంటిమి. మనుష్యుల మృగములుగను పక్షులుగను జేయు తంత్ర మామాంత్రికుఁ డెఱిఁగియున్న వాఁడు. వాఁడు పరమతపోనిధియగు సిద్ధునిం బరిమార్చి మనచారాయణుని గార్ధభముగావించిన క్రూరుండు, చారాయణు నత్తమామలును గనంబడుటలేదు. వీ రెల్ల నక్క పటాత్మునిచేఁ జిక్కిరనియెంచి యిం దరుదెంచితిమి. మనమందఱమునుఁ గలసి భోజనృపపురందరునకు వానిదుర్ణయ మెఱింగించి శిక్షింపఁజేయవలయును. అనిపలికిన విని కుచుమారుం డిట్లనియె.

అయ్యయ్యో ! ఆసిద్ధుం బరిమార్చినవాఁడు వీఁడా ! అక్కటా !