పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

314

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

వినోదము జూచుట కేర్పాటుచేసిరి. సోమవారము విద్వత్ప్రసంగము, మంగళవారము వాహ్యాళి, బుధవారము గానసభలు, గురువారము భైరవుని మృగములయాట జరగునఁట. వీనినిమాత్రమే వ్రాసికొనివచ్చితిమి. రేపు మామిత్రులతోఁ గలిసికొని భైరవునిదుర్నయము రాజున కెఱింగించి శిక్షింపఁ జేయుదుము. భైరవుండున్న తోటలోనికింబోయి చూచితిమి మృగములు పక్షులు పలురకములు చాలగలవు. వానిలోమన వారుందురు. మీరు విచారింపవలదని పలికిన విని సువర్ణపదిక యిట్లనియె.

మాబావ యక్షుండు పక్షియో మృగమో యైయుండఁ బాడుటకు నాకు నో రెట్లువచ్చును? రేపటిగానసభకు నేను బోవఁజాలను. పిమ్మట విచారింతముగాక. వారిం దీసికొనివచ్చుదనుక యేవినోదమునకుం బోఁగూడదు. మఱియు నీలీలావతినిగుఱించి యేమియాలోచించితిరి? ఈమహాసాధ్వి మీరు భోజునివార్తలు సెప్పుచుండ నూరక దుఃఖించుచున్నది. ఆవినోదములలో నీమెగూడఁ బాలుగొనవలసినదేకదా? అన్నిటికంటె ముం దీమె కుపకారముసేయవలయును. అని చెప్పిన విని యామె కన్నీరు దుడిచికొనుచు నిట్లనియె.

బిడ్డలారా! నేను వట్టిపాపాత్మురాలను. నాపూర్వకృతము కడు చెడ్డది. నాకు వీ రేమియు నుపకారము సేయఁజాలరు. నాభర్త నాయం దేదియో యనుమానముజెంది యడవులకుఁ ద్రోయించెను. నేను మొండికట్టియనుకావున జీవించితిని. ఇప్పుడు నాసుగుణ మేమిపరీక్షించి మహారాజు నారాక కంగీకరించును? మఱియుఁ బ్రతికియుంటినని వినినఁ జెప్పినవారిపయిఁ గుపితుండగును. నామాట యటుండనిచ్చి యక్షవిముక్తికై ప్రయత్నింపవలయును. అతండు కడుదయావంతుఁడు అని చెప్పిన విని చారాయణుఁ డిట్లనియె.

తల్లీ ! నీవల్లభుఁడు భవద్వియోగమున కెల్లపుడు దుఃఖపుచున్నట్లు ప్రజలు చెప్పుకొనుచున్నారు. అట్టి యుత్సవసమయమందుఁగూడ