పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

304

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నీతల్లిదండ్రులుగూడ వానికట్టులోఁ బడియుందురు. నీవు చింతింపకుము. మేము ధారానగరంబున కరుగుదుము. నామిత్రునితోఁ గూర్తుము అని యూఱడంబలికి యక్షేంద్రా ! ఆపాపాత్మునొద్దనున్న మృగములన్నియు నిట్టివేసుఁడీ ! మీరువోయి మఱికొన్నిమృగములం బట్టుకొనిరావలయు నీయుపకారము సేయవలయు వాని శిక్షించునుపాయ మరయవలయునని ప్రార్థించెను.

సువర్ణ పదికయు రత్న పదికయు లీలావతియు నామల్లికకుఁ దమ బంధుత్వము దెలియఁజేసి యాదరించి యూ ఱడించిరి.

ఆమఱునాఁడుదయంబున యక్షుండు వెండియు బయలుదేరి యాభైరవుఁడున్న యడవికిఁబోయి తిరోహితుండై వాఁడు చేయుపనులఁ బరీక్షించి చూచుచుండెను. ధారానగరమునఁ గాళిదాసుం గౌరవించు నిమిత్తము గొప్పసభ జరగుననియు నప్పటికి మృగములతోఁగూడ నీవువచ్చి వినోదములఁ జూపించి గొప్పకానుకలంది పొమ్మని భోజనృపాలునిమంత్రు లాభైరవున కాహ్వానపత్రిక నంపిరి.

ఆభైరవుం డందుల కామోదించి నాఁటిమధ్యాహ్నము బరువు మోసెడుగాడిద నొకదానిమెడలో వేఱొకతాయెత్తును గట్టి మేకను గావించి దీనింగోసి నేఁడు కూరగావండుమని వంటవాని కర్పించెను. వాఁడు దానిగోయుటకుఁ జెట్లమాటునకుఁ దీసికొనిపోయెను. ఆమార్పులన్నియుం జూచుచున్న యక్షుం డావంటవానింజేరి యోరీ ! నీ కీరత్నకంకణ మిచ్చెద నీమేకం జంపక నాకిత్తువేయని యడిగిన వాఁడు కనుసన్న సేయుటయు రహస్యముగా నాకడియము వానికిచ్చి యామేక నెత్తికొని గగనమార్గంబునఁ దనయింటికిం బోయెను.

బానిసవాఁడు వేఱొకమేకను స్వల్పవిత్తమునకుఁ గొని కోసి వండి భైరవున కాహారముగా నిడియెను. యక్షుం డామేకతో నెలవునకరిగి నంత నందఱు మూగికొని వీఁడెవ్వఁడో యని యాలోచించుచు మెడ