పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కసు కథ.

299

యెవ్వతెయో యెఱుఁగుదురా? అని యడిగిన నతం డామెంజూచి యో హోహో ! సువర్ణపదికయా ! యెప్పుడువచ్చినది? ఎట్లువచ్చినది ? మగని సంపాదించినదా? ఏమి? యని పలుకుచు దగ్గిరకుఁ జేరదీసికొని గారవించెను.

సువర్ణపదికయు నతనికి నమస్కరించుచుఁ దనవృత్తాంతమంతయు నెఱింగించినది. యక్షుండు మందహాసముగావించుచు నా పండితుండేఁడి? ఇందున్న వాఁడా? అని యడిగిన రత్నపదిక పుష్పవాటికలోనున్న వారని చెప్పినది. సువర్ణపదిక పోయి తీసికొనివచ్చినది. అతండు యక్షునకు నమస్కారము గావించెను. యక్షుండు నారించుచు మీరు భూసురులు పండితప్రవరులు మీరు మాకు వందనీయులు మే మాశీర్వచనపాత్రులమని పలికిన సువర్ణనాభుండు భూసురలకన్న దివిజు లెక్కువవారుకారా ? మనుష్యులకు దేవతలు వంద్యులని యుక్తియుక్తముగా ననువదించెను.

ఆవిషయమై యిరువురకుఁ గొంతసేపు ప్రసంగము జరగినది. అందు సువర్ణనాభుని విద్యాపాటవము తేటపడుటయు యక్షుఁడు మిగుల సంతసిచుచు నతనిఁ బెద్దగా గౌరవించి యర్చించెను. సువర్ణ పదిక యక్షునితో బావా ! నీవు నిత్యము నెందుఁబోవుచుందువు? నీవు తీసికొనివచ్చిన మయూర మెక్కడిది? వింత లేమని యడిగిన నతం డిట్లనియె.

మీసందడిలో నామాట చెప్పుట మఱచిపోయితిని. నేను భూమి యంతయుఁ దిరిగి వచ్చుచుందును. వినుము. నేఁడొక యరణ్యమార్గంబున వచ్చుచుండ నొకచోట మృగముల నాడించువాఁ డొకఁ డీ నెమలి కాలిత్రాడు జారిపోయిన నిది యెగిరి వృక్షాగ్రముల వసించినది. దానిం బట్టికొనలేక విసిగి చంపుటకు రాళ్ళు విసరుచుండఁ జూచి దీని నెత్తుకొని తీసికొనివచ్చితిని. ఇదియే దీనికథ. పెంపుడిదో యడవిదో నాకుఁ దెలియదు. దీనిం దెచ్చినవేళ మంచిది. మిముఁ జూడఁగంటిమి. నీకుఁ గానుక