పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

చాటుచాటుగాఁబోయి వారిమాట లాలించుచుండును. ఒకచో నిరువురు పనికత్తెలిట్లు మాట్లాడుకొనుచుండ నాలించెను.

ఒకతె - కనికీ ! నిలునిలు. ఎందు బోయెదవు? చేసినపని సాఁగినదికదా? కానుక లందితివా?

కనికి -- బాపియా! తొందరగాఁ బోవలసిన పనియున్నది. కానుకలా? ఒడలంతయు బంగారమైపోయినది.

బాపి -- అట్లనుచున్నావేమి ? వారు కానుకలీయలేదా? నీతల్లి యీయేటితో ఋణవిముక్తుల మగుదుమని చెప్పినదే.

కనికి - చేతిలో వేసికొనికాని యేపనియుం జేయరాదు. ఆపండితులిచ్చిన పత్రిక రాజుగారి మంచముపై వైచితిని. అది చదివికొనియే కాళిదాసుపై ననుమానముగలిగి మొదటఁ గొన్నిదినములు మాటాడుట మానివేసిరి. పిదప నయ్యనుమానము బలపడిన పిమ్మట లేవఁగొట్టిరి. అది నేను జేసినపనివలన గాదఁట.

బాపి -- మఱియెవ్వరు చేసినపనివలన ?

కనికి - లీలావతిపనికత్తియ బుచ్చివెంకి చేసినదఁట.

బాపి - అది యేమిచేసినది ?

కనికి – అమరించినదానిలో వ్రేలుపెట్టినది. మఱేమియు లేదు. వినుము. లీలావతి యాగదిలో నెవ్వరున్నారో చూచిరమ్మనఁగాఁ గాళిదాసు పండుకొనియిండ రాజుగారని చెప్పినది. ఆమాటనమ్మి యామె వెళ్ళి కాళిదాసుముసుఁగు లాగినది. రాజుగారదిచూచి యిరువురను.

బాపి - మెల్లగాఁ జెప్పుము. భార్యను లేవఁగొట్టెనా

కనికి - బాబో అది బ్రహ్మరహస్యముసుమీ ! ఎవ్వరితోనైఁ జెప్పెదవుగాక.

బాపి - నా కామాత్రము తెలియదనుకొంటివా? నానమ్మకము మీయమ్మకుఁ . దెలియును, అందులకే మొదటి రహస్యము