పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కసుకథ.

297

అందున్న రత్నకాంతులు పుష్పవాసనలు సువర్ణనాభునిహృదయమునకు మిక్కిలి యక్కజము గలుగఁ జేయ దాపునకుఁ బోయి పరీక్షించుచుండెను.

అప్పుడు సువర్ణపదిక మెల్లగా గుహాముఖద్వారంబున నిలువంబడి అక్కా ! రత్నపదిక ! అక్కా ! రత్న పదిక ! అని పెద్దయెలుంగున యక్షభాషతోఁ బిలిచినది. ఆధ్వనివిని రత్నపదిక తటాలున లేచివచ్చి తలుపుతీసి యెదురనున్న సువర్ణ పదికంజూచి నీవెవ్వ తె వనఁబోయి యంతలో అమ్మనేజెల్ల ! నాముద్దుచెల్లెలు సువర్ణపదికయే. తల్లీ ! యెట్లు వచ్చితివేయని గాఢాలింగనము సేసికొనియెను. సువర్ణ పదిక నానంద బాష్పములతోఁ బ్రత్యాశ్లేషము గావించి సంతోషముచేఁ గంఠమురాక డగ్గుత్తికతో అక్కా ! సేమముగా నుంటివా? బావ యేఁడి ? నిన్నుఁజూచి మూఁడుసంవత్సరములైనది. ఇఁకఁ జూపు దొరకదేయనుకొంటిని దైవికముగా వచ్చితినని చెప్పినమాటయే చెప్పుచు నడిగినమాటయే యడుగుచుండ రత్న పదిక యానందబాష్పములచేఁ జెల్లెలిశిరము దడువుచు నిట్లనియె.

సహోదరీ ! అక్కటా! నీకొఱ కెంతపరితపించుచుంటినను కొంటివి ? మీబావయు నీమాట దలపెట్టినప్పుడెల్ల కన్నుల నీరునింతురు. మే మిందుంటిమని యెవ్వరుచెప్పిరి? ఎందుండివచ్చితివి? అలకాపురంబున మనబంధువులు స్నేహితులందఱు కుశలముగా నున్నారా? కుబేరధూర్తుఁ డేమిచేయుచున్నాఁడు ? ఎన్నఁడైన మమ్ముఁ దలపెట్టునా ? మే మిందుఁజేరి హాయిగా సుఖించుచున్నాము. ఈగుహామందిరము లోపలఁ బెద్దపట్టణమంత యున్నది. అలకాపురంబునంగల వింతవస్తువులు రత్నంబులు మీబావ తీసికొనివచ్చి యిందుంచిరి. నీవు దాపునలేనికొదవతప్ప నేలోపము లేదు. నీ వప్పుడు మాతో రమ్మనిన సంగీతలాలసవై వచ్చితివికావు. మేమువచ్చినతరువాత జరిగినకథయంతయుఁ జెప్పు