పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్కస్సుకథ.

289

పొగయని భ్రాంతిపడుచుందురు. లోకోత్తరమైన యాశ్లోకమును విని యల్లాణుండు విస్మయము చెందుచు నక్కవిం గౌఁగిలించికొని మహాత్మా! నీపేరేమి ? నన్నుఁ గృతార్థుంజేయ నరుదెంచిన నీకులశీలనామాదు లెఱింగింపుమని ప్రార్థించినఁ దనపేరు కాళిదాసనియు భోజునియాస్థానమున నుండువాఁడననియు దేశములు సూడ బయలువెడలితిననియుం జెప్పెను. అల్లాణుండు నిటలతఘటితాంజలిపుటుండై కవీంద్రా! మహేశ్వరపదాంభోజప్రియుండవగు నీప్రఖ్యాతి యిదివఱకే మాకు శ్రోత్రామృతమైయున్నది. మదీయపురాకృతసుకృతవిశేషంబునంజేసి నీవునాకడ కరుచితివి. నేను గృతార్థుండ నైతి. నాసింహాసన మధిష్టించి నీ వీరాజ్యము పాలించుకొనుము. నీకు దాసుండనై పరిచర్య గావింతునని ప్రార్థించినఁ గాళిదాసు బ్రాహ్మణులకు రాజ్యమేల ? మఱియు భార్యాపుత్రహీ నుండ నే నేమిసేసికొందును? ఊరక వసించెద నన్నవస్త్రము లిచ్చినం జాలునని పలుకుటయు నతండు సంతసించుచు నతని కొకదివ్యభనము గట్టి యిప్పించి తనతోసమానమగు గౌరవముతోఁ జూచుచు విద్యావినోదములతోఁ గాలక్షేపము సేయుచుండెను.

సర్కస్సుకథ.

అళ్లాణభూపతి సకలవిద్యాపరీక్షకుఁడను వాడుక యున్నది. ఒకనాఁ డమ్మహారాజు పేరోలగమున్న సమయంబున సింహశార్దూలాది క్రూరమృగంబులు కుక్కలవలె వెంటనంటి రా భైరవుండను తాంత్రికుఁ డరుదెంచి నృపతికి మ్రొక్కుచు దేవా ! నేను మృగము చేఁ బరిజనుల చేతంబోలె నద్భుతవినోదకార్యంబులఁ జేయించెద. గొప్పగొప్పసంస్థానముల కరిగి నాయాటఁ జూపి పెక్కుబిరుదముల నందియుంటిని. ఆటకు సెలవీయుఁడు. మీవలనఁగూడ ననంతపారితోషికము లందఁగలనని ధైర్యముగాఁ బలికిన నయ్యొడయఁ డంగీకరించి నాఁటిరాత్రియే కాళిదా