పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

    లేదు సతికిన్క కాటంక మేదియైన
    కనలినఁ ద్రిమూర్తులకుఁ గడగడలుకావె ?

గీ. ఒకతె భాస్కరు నుదయింపకుండఁ జేసె
    నొకతె చల్లార్చె దావాగ్ని హోత్రు నొకతె
    బ్రాహ్మణుని తేజమడఁచె దర్పంబడంగ
    నేమి గావింపనోప దీభూమి సాధ్వి.

భళ్లాణునిఁ బరీక్షింప నీశ్వరప్రేరితుండై యామహేశ్వరుఁ డట్లు కో రెనని కొందఱును, సహజకామాతి రేకంబున మహాపుణ్యాత్మునిఁ దుచ్ఛభోగంబుకోరుటచే ధూర్తవిప్రుండు పరాభవింపఁబడెనని కొందఱును పలుకఁజొచ్చిరి.

అట్టిసాధ్వీమణిం గూడికొని యల్లాణభూపాలుండు ధర్మంబున బ్రజలం బాలింపుచుఁ గవుల నాదరింపుచు దిగంతవ్యాప్తకీర్తియైయొప్పు చుండెను. భోజునిచే నవమానింపఁబడి కాళిదాసకవి నానాదేశములు దిరుగుచు నొకనాఁ డమ్మహారాజుగారియోలగంబున కరిగి యాత్మీయ తేజంబున కచ్చెరువందుచు సభ్యులు సూచుచుండఁ గుడిహస్తమెత్తి,

శ్లో॥ అల్లాణక్షోణిపాల త్వదహితనగరే సంచరంతీ కిరాతీ
      కీర్ణాన్యాదాయ రత్నాన్యురుతరఖదిరాంగారశంకా కులాంగీ।
      క్షిప్త్వా శ్రీఖండఖండం తదుపరి ముకుళీభూతనేత్రా ధమంతీ
      శ్వాసామోదానుయాతైర్మధుకర నికరైర్ధూమశంకాం బిభర్తి ॥

ఓమహారాజా ! నీచేనోడింపంబడి పారిపోయిన శత్రురాజుల పట్టణమందు సంచరించుచున్న కిరాతకాంతలు అక్కడ్కడ దొరకిన రత్నములను జండ్రనిప్పులనుకొని ప్రోగుచేసి వానిపై మంచిగంథపు సమిథలవైచి కన్నులమూసికొని యూదుచుండఁగాఁ దదీయశ్వాసానిలముల కావరించుచున్న తుమ్మెదగుంపులనుజూచి యూదగా రాదుచున్న