పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

యడిగిన విని యామహేశ్వరుండు తటాలునవచ్చి యారాజుం గౌఁగిలించుకొని మహారాజా! నన్ను రక్షింపుము. ఈమె తేజము నామేను మండఁజేయుచున్న ది. నీదరిజేరుటచేఁ గొంచెము చల్లఁబడినది నాకేమియు నక్కఱలేదు. నాదారిని నన్నుఁ బోనీయుఁడు అని పలికెను.

రాజు వానివీపుగొట్టుచు మహేశ్వరా ! ఊరక వెఱచెదవేల ? మహాశక్తి యెక్కడ? దివ్యమంగళవిగ్రహయగు నాయువతిం జూడుము. అభీష్ట మేమిటికిఁ దీర్చుకొంటివికావు? ఇది గణికాత్మజ- కన్నులం దెఱచి చూడుము. అనిపలికిన నతం డిట్లనియె.

అమ్మయ్యో! రెప్పలు బరువెక్కినవి. ఆమెతేజము కన్నులఁ దెఱవనీయకున్నది. అదిగో త్రిశూలము కదల్పుచున్నది. బాబూ! మహాశక్తినిఁ బ్రయోగించితి వెట్లుతాళఁగలను ? రాజా ! రక్షింపుము. మేను భగ్గున మండిపోవుచున్నది. అనిపలుకుచు గంగవెఱ్ఱులెత్తినవాఁడుంబోలె నిటునటు గంతులు వేయుచుండెను.

రాజు వానింబట్టుకొని అయ్యో ! ఇదియేమికర్మము ? ఏమియు లేనిదే భ్రమపడుచుంటివేల ? నిలు నిలు కన్నులెత్తి చూడుమని యోదార్చెను. అతఁడు కన్ను లెత్తిచూచి బాబో ! కన్నులుపోయినవి గ్రుడ్డివాఁడనై పోయితిని. చెడుకోరికకోరినందులకు నా కిట్టిశిక్ష విధించితివి. బుద్ధివచ్చినది. ఇఁక నెన్నఁడు నిట్టియభిలాషపడను. అని లెంపలువాయించుకొనుచుండెను.

మహేశ్వరా ! ఇది గణిక. నేను రాజును. మేముగాక యిందెవ్వరునులేరు. ఆదిశక్తి యెక్కడనున్నదియో చూపుమనియడిగిన నతండు దేవా ! వేశ్యనని నామంచముదాపునకువచ్చి నిలువఁబడిన యామెయే ఆదిశక్తి. పార్వతి భవాని దుర్గ త్రిశూలధారిణి అదిగో యెదురనుండ నేదియని యడిగెదవేమిటికి ? వేగ మామెపాదరజంబుదీసి నామేనికి రాయుము. నామేను జల్లఁబడఁగలదు. లేకున్న గడియతాళలేనని బ్రతి