పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అళ్లాణరాజుకథ.

283

ముగాఁ బడిపోయితి రేల ? మంత్రులుపంపిన పత్రికలో నేమియున్న ది ? నిజముచెప్పుఁడని యడిగిన నయ్యొడయం డిట్లనియె.

తరుణీ ! నీతో నేమిచెప్పుదును ? మహేశ్వరునికోరికఁ దీరుపలేక యపరాధినైతిని. వారకాంత నర్పింతునని యతని శయ్యపైఁ గూర్చుండఁ బెట్టితిని. దేహధర్మములు దుర్భరములు. నేఁటితో నావ్రతవిఘ్న మైనది. ఇఁక నేను గుడువను. ప్రాయోపవిష్టుండ నయ్యెదనని భార్య కావృత్తాంత మంతయుం జెప్పెను.

ఆమె యించుకథ్యానించి ప్రాణేశ్వరా ! మీయర్ధాంగలక్ష్మిని వశవర్తి నేనుండ మీకుఁ జింతయేటికి ? మహేశ్వరునికామితము దీర్చుట కితరాంగనలఁ బంపుటకు మీకేమి యధికారమున్నది ? వ్రతవిఘ్నమగు నని విచారింపనేల ? నన్ను నియోగింపుఁడు. నే నతనియభీష్టము తీర్చెదఁ దొల్లియిక్ష్వాకునిభార్య భర్తయనుమతి నతిథిని సత్కరింపలేదా ? అట్లే నేనునుగావించి కృతకృత్యురాల నయ్యెద నాజన్మము సాద్గుణ్యము నొందఁగలదని ప్రార్థించినది.

ఆబోఁటిమాటలు విని యాక్షితిపతి యపరిమితానందము చెందుచు నత్తలోదరిం గ్రుచ్చియెత్తి మత్తకాశినీ ! నీపలుకులు మినుపలుకుల కనుకూలించియున్నవి. ప్రియురాలన నిన్నే చెప్పవలయును. పూర్ణముగా సంతోషించితిని. వెలయాండ్రు విడిగా లభించిరికారు. మఱియొక యువతిని వ్యభిచారమునకు నియోగించుట యధర్మము. వ్రతము విడువవలసిన సమయములో మంచియుపాయముచెప్పితివి. నీవుపోయి మహేశ్వరుని కామ్యమును దీర్పుము. నీ కేమియు దోసములేదు. పొమ్ము. మఱియు రాజభార్యవని చెప్పఁగూడదు. వారాంగనననియే చెప్పుము. లేకున్న నతం డంగీకరింపఁడుసుమీ! అని యుపదేశించి యంపెను.

సువ్రత పాతివ్రత్యభంగంబుకాదను దృఢనమ్మకముతో నూత్న భూషాంబరంబులు ధరించి కస్తూరిచందనచర్చి తాంగయై మేవాసనిను