పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

పరిహసించిన నవ్వుచు నతఁడు ఓసీ ! నీవలనఁ బనిగలిగియే వచ్చితిని. ప్రభుకార్యము సద్యోఫలము. అరవుకాదు. ఈరాత్రి గాళీచేసికొనిరాఁ గలవా ? అని యడిగిన నప్పడఁతి భావా! యింతప్రొద్దువోయివచ్చి యీమాటచెప్పెదవా ? నేఁడు శివరాత్రియే యనుకొంటిని. రాజుగారి చేత నర్చితుండగు నొకలింగధారి యిప్పుడేవచ్చి తాంబూలమిచ్చి లోపలికిఁబోయెను. గడియదాటినది. లేకున్న మాటదక్కుంగదా! పోనీ! యాయననడిగి రానాయేమి ? అనుటయు నతఁడు అట్లైనఁ బెక్కండ్రఁ దీసికొనిపోవుదును. రాజశాసన మట్లులేదు. కాళీగానున్న వారాంగన కావలయునని పలుకుచు నటనుండి శరచ్చంద్రయింటికిఁ బోయెను. అది వయసుకానితో ముచ్చటలాడుచుండెను. పేక్కేల నాభుజంగుఁ డా యూరనున్న వారకాంతలగృహములన్నియుఁ ద్రొక్కిచూచెను. ఒట్టు పెట్టిన ట్లొక్కరితయు విడిగాఁ గనంబడలేదు. అతఁ డావార్త మంత్రులకుఁ దెలియఁజేసెను.

మంత్రులు ఔరా ! ఇది వింతగానున్న ది. వేయిగడపగల వేశ్యవాటికలో భుజంగసంగరహితయగు గణిక దొరక లేదే. మనమెవ్వతెనో తీసికొనివత్తుమని రాజు గంపెడాశతో నుండును. మనముపోవువఱకు భుజింపఁడు. ఇప్పు డేమిచేయుదుము. అని విచారించుచు మఱలమఱల నావిటు నంపి వారుగూడఁ బరీక్షించిచూచిరి. విడివెలయాలు దొరకలేదు. కపటముచేసి తీసికొనిపోయినచో రాజునకుఁ దెలిసిన శిక్షించును. యథార్థము సెప్పుటయే మంచిదని తలంచి మంత్రులు రాజునొద్ద కరిగి యాతెఱం గెఱింగించిరి.

భార్యతోఁగూడ దేవగృహంబున శివపూజజేయుచున్న భళ్లాణుం డావార్తవిని హాహాకారము సేయుచుఁ బుడమింబడి మూర్ఛిల్లెను. సువ్రత పతిపాటుజూచి వెఱపుతో లేవనెత్తి శైత్యోపచారములు సేయుచుఁ దెప్పిరిల్లి తనవంకఁజూచుచున్న భర్తతో మహాత్మా ! ఇట్లకారణ