పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అళ్లాణరాజుకథ.

281

పద్మగంధి — అబ్బా ! నీవు మాదిట్టవు. నాయపరాధము గనుపెట్టితివి. నీవిచ్చుబత్తెముతో నే జీవించుచుంటిమి. ఇష్టముండిన నుండుము లేకున్న పొమ్ము. మాయింటికి స్నేహితులు పరిచితులు వచ్చుచుదురు. మాటిమాటికి శంకలుసేసిన నుత్తరముసెప్పువారు లేరు.

అని కసరిపలికినది. ఆచార్యులు త్రాగియుండుటచే నొడలెఱుంగక కోపముతో నోసిరండా! ఎంతక్రొవ్వి పలుకుచుంటివి ? పుట్టెడు మాన్యమమ్మి తెచ్చియిచ్చినసొమ్ము నీయబ్బగడించినదనుకొంటివా ? అని పలుకుచు వీపుపై నొకగ్రుద్దుగ్రుద్దెను. అది మొఱ్ఱోయని యఱచినది. రాక్షసివంటిదానితల్లి యాకలహము విని వచ్చి ఓరి సిగ్గుమాలినకుక్కా! నాకూఁతుం గొట్టుచుంటివిరా ? నీచేతులు మాడిపోను, దున్నపోతువలె నున్నావు. ఆవచ్చినవాఁడెవ్వఁడో చూపుము. వానిజుట్టో నీజుట్టో గొరిగించెదనని పలుకుచు నాయాచార్యుని జుట్టుపట్టుకొని వీధిలోని కీడ్చుకొని పోయి యేఁడీ ! చూపుము. చూపు మని పెద్ద కేకలు పెట్టుచుండెను. బాబో ! చచ్చితిఁ జచ్చితినని యాచార్యు లఱచుచుండెను.

ఆప్రాంతమందున్న మంత్రు లాకోలాహలము విని దాపునకుఁ బోయి వాని నట్లుకొట్టుచుంటివేమని వేశ్యమాత నడిగిరి. అది బాబూ ! ఎవ్వఁడోవచ్చి మాయింటివీధితలుపుఁ గొట్టెనంట. వాఁడెందులకుఁ గొట్టెనని వీఁడు నాకూఁతుం జావమోదం జూడుఁడు. అని యావృత్తాంతము చెప్పినది. మంత్రులు నవ్వుచు, ఆతలుపుగొట్టినవాఁడు మేముపంపినవాఁడు మఱియొకఁడుకాఁడు పొండు పొండు తగవులాడకుఁడు అని మందలించి వారి సంపివేసిరి.

ఆవిటశిఖామణి యటనుండి మణిమంజరియింటికరిగి యది సరసునితో సొగటాలపాళియాడుచున్న దని దాదివలనవిని యందుండి మంజువాణియింటి కరిగెను. మంజువాణి తలుపుతీసి యోహో భావగారా! దారితప్పివచ్చితిరేల ? మధురాధర జూచిన మోసమువచ్చుంజుఁడీ ! అని