పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

274

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నని చెప్పెనఁట. అట్లుచెప్పినను విశ్వాసములేక పరమశాంతమూర్తి విద్యాస్వరూపుని జంప యత్నించిన యీకృతఘ్నుని కరుణింపరాదని పలికెను. సామాజికులెల్ల సది యుచితముచితమని యేకగ్రీవముగాఁ గేకలుపెట్టిరి.

కుచుమారుం డందుల కీయకొనక వీనితలిదండ్రులు చాలమంచివారు. నాకు భోజనముపెట్టి సరస్వతీవృత్తాంతము చెప్పుచు సహాయముగా నా వెంట వీని నంపిరి. జాగ్రత్తగాఁ గాపాడుమని చెప్పిరి. వీఁడు దుర్మార్గుఁడైనను వారింజూచి వీనిని మన్నింపుఁడని వేఁడుకొనుచున్నాను. వారింటగుడిచిన విశ్వాసము నన్నిట్లు చెప్పుటకుఁ బ్రేరేపించుచున్నది. ఏమిచేయుటకును మనము కర్తలముకాము. భగవంతుఁ డొకనివలన భయము గలుగఁజేసి మఱియొకనివలన నాభయము పోఁగొట్టుచుండును. అని యుక్తియుక్తముగా నుపన్యసించి వాని శిక్షింపకుండఁ గాపాడెను. ఆతని కృపాళుత్వ మెల్లరు స్తుతియించిరి. అంతటితో సభముగించి హిరణ్య గర్భండు కుచుమార గోనర్దీయ ఘోటకముఖ భోజులకుఁ బ్రత్యేకము దనకోటలో విడిదలనియమించి యందుఁ బ్రవేశపెట్టి గౌరవింపుచుండెను.

ఆవృత్తాంతమంతయు సఖురాలివలన విని సరస్వతి మిగుల నా నందించుచు మఱియొకచిలుకను విద్యలుగఱపుమని చెలికత్తెచేతికిచ్చి కుచుమారునొద్ద కనిపినది. కుచుమారుం డాకీరమును దువ్వుచు నస్తిమాలఁదగిలించి నవ్వుమాటలగా దానికి విద్యల నుపదేశించి పంపెను.

ఆచిలుక వెనుకటిచిలుకకన్నఁ బ్రౌఢముగా సరస్వతితోఁ బ్రసంగించి యోటుపఱచినది. అప్పుడప్పడఁతి ప్రహర్ష సాగరమున మునుఁగుచుఁ దనసంతోషమును బత్రికాముఖముగా నతనికిఁ దెలియఁజేసెను.

హిరణ్యగర్బుండు శుభముహూర్తమున సరస్వతినిఁ గుచుమారునికిచ్చి వివాహము గావించెను. భోజుండు ఘోటకముఖుండును గోనర్దీయుఁడుఁ బెండ్లిపెద్దలై మహోత్సవములఁ బెక్కులు గావింపఁజేసిరి. వేడుకలతో గొన్నిదినములు గడిపి ఘోటకముఖుం డొకనాఁడు