పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురందరపురము కథ.

273

గ్రహించి చెప్పితివి. మనకుచుమారుఁడు పునర్జన్మమెత్తెనని యావృత్తాంతము మరల వానితోఁ జెప్పెను. తాను రాజైన తెరంగును సంక్షేపముగాఁ జెప్పి మేమువోలె నీవుగూడ నింకను ధారానగర నురుగ లేదా? దత్తకాదిమిత్రులు మననిమిత్తమై వేచియుందురు. నేను సింహాసన మెక్కి యందుఁ బోవలయునని ప్రయత్నముచేయుచుండ నంతలోఁ గుచుమారుండు సరస్వతిని వివాహమాడుచున్నాఁడనువార్త విని యిందువచ్చితిని. కుచుమారునివివాహ మైనతరువాత మన మందుఁ బోవుదము. ఈరాజ్యములు మనమేడ్వురము సమముగాఁ బంచుకొనవలయును. అని పలికిన విని సంతసించుచు ఘోటకముఖుండు సుఖదుఃఖసములమగు మన కీభేద మేలకల్గెడిని ? మనచారాయణుఁ డొకపండితపుత్రికం బెండ్లియాడి ధారానగరమున కరిగెను. నే నీపాటికి ధారానగర మరుగవలసిన వాఁడనే. ఒకస్నేహితునిభార్య నొకతాంత్రికుఁడు హరించెను. వాని మూలమున దేశాటనము చేయుచుంటిని. ఆమహనీయుని కులశీలనామములు నాకుఁ దెలియవు. ఆతఁడు సెప్పలేదు. నే నడుగలేదు. ఆకూర్చున్నవాఁడే యతఁడని నిరూపించిచెప్పెను. అంతలో భోజుండు వారికడకువచ్చి నమస్కరించుచుఁ దత్పాండిత్యముగుఱించి మిక్కిలి యగ్గించెను.

వారునలువురు జనాంతికముగా మాట్లాడికొనుచుండఁగాఁ గొంతసే పుపలక్షించి హిరణ్యగర్భుండు వారితో నార్యులారా ! కాలాతీతమైనది. చెప్పవలసినమాటలం జెప్పితిరి. చేయవలసినవిధానము తేలినది. నిజము బయలుపఱచితిరి. ఇఁక నీశంబరుని కేమిశిక్షవిధింపవలయునో సభాధ్యక్షుఁడు చెప్పవలసియున్నది. ఆమాట వినుటకు సభ్యులు తొందఱ పడుచున్నారని పలికిన విని ఘోటకముఖుఁడు వెండియుఁ బీఠమెక్కి యెల్లరు విన వీఁడు మిత్రద్రోహి. పాపమునకు వెఱచువాఁడు కాఁడు. ఇట్టి వాఁడుండిన లోకమున కపకారమగును. వీని కుఱిశిక్ష విధించుట యుచితము. వీఁడు తన కేమియుపకారము సేయుదువని కుచుమారు నడిగెనఁట. అతఁడు నామిత్రులతో నాలోచించి నీకుఁ దగినయుపకారము సేసెద