పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పురందరపురము కథ.

269

కుచు - అది యిష్టములేనిమాట. కానని యామె యెట్లు నిదర్శనము చూపఁగలదు?

సభాపతి -- నీవు తిరుగాఁ బ్రసంగించుట కొండంబడనికారణము చేత.

కుచు -- అది నా కవమానకరమని మానివేసితిని.

సభ - ఆమాట యేమియు సమంజసముగా లేదు. ప్రసంగాధిక్యంబున విద్యలకు మెఱుఁగువచ్చునుగాని త్రుప్పుపట్టనేరదు. పోనీ యామెగాదు మే మడిగెదము సమాధానము చెప్పెదవా ?

కుచు - నే నెవ్వరికినిఁ జెప్పఁదలఁచుకొనలేదు. (సభాసదులందఱు పక పక నవ్వుచున్నారు.)

సభాపతి -- నీవు చదివినవిద్యలన్నియుఁ జిలుక కుపదేశించుటచే మఱపుజెందితివేమో యాలోచించుకొని చెప్పుము.

కుచు - ఆమాటయు వాస్తవమే.

సభ - పోనీ, నీకుఁ గుచుమారుండని పేరున్నట్లు మీగ్రామస్థులచేఁ జెప్పించెదవా?

కుచు - చిత్తము. చెప్పింపగలను

సభా - ఆగ్రామ మేదియో చెప్పుమిప్పుడే వారినిందు రప్పింతును.

అనుటయు వాఁ డేమియుఁ జెప్పలేక తబ్బిబ్బుపడఁజొచ్చెను. అప్పుడు సభాపతి లేచి యిట్లుపన్యసించెను.

శ్లో॥ ఆబద్ధకృత్రిమసటాజటి లాంసభిత్తి
      రారోపితో యదిపదం మృగవైరిణ శ్శ్వా।
      మత్తేభకుంభతటపాటన లంపటస్య
      నాదం కరిష్యతి కథం హరియూధపస్య॥

కుక్కకు కృత్రిమకేసరములుగట్టి సింహవేషమువైచి సింహంబు గూర్చుండుస్థానమునఁ గూర్చుండబెట్టినంత, మదపుటేనుఁగుల గండస్థలముల వ్రక్కలుచేయు సామర్థ్యముగల సింహముగర్జించునట్లు గర్జింపఁ