పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

బ్రహ్మదత్తునిభార్య-

శ్లో. రధస్యైకంచక్రం భుజగనమితాస్సప్తతురగా
    ని రాలంబోమార్గశ్చరణ వికలస్సారధిరపి !
    రవిర్యాత్యేవాంతం బ్రతిదిన మపారస్యనభసః
    క్రియాస్సిద్ధిస్సత్వెభవతి మహతాంనోపకరణైః ॥

ఘోటకముఖుఁడు--

శ్లో. విజేతవ్యాలంకా చరణతరణీయోజలనిధిః
    విపక్షఃపౌలస్త్యోరణభువిసహాయాశ్చకపయః।
    పదాతిర్మర్త్యోసౌసకలమవధీద్రాక్షుసకులం
    క్రియాసిద్ధిస్స త్వెభవతి మహతాంనోపకరణైః ॥

మల్లిక.

శ్లో. ధనుఃసౌష్పం మౌర్వీమధుకరమయీ చంచలదృశాం
    దృశాంకోణో బాణస్సుహృదపిజడాత్మాహిమకరః ।
    స్వయంచైకోనంగ స్సకలభువనం వ్యాకులయతి
    క్రియాసిద్ధిస్స త్వెభవతి మహతాంనోపకరణైః॥

మహాత్ములకుఁ గార్యసిద్ధి ప్రభావముచేతనే యగును. ఉపకరణములతోఁ బనిలేదు అని సమప్యార్ధము. కుండయందు బుట్టి మృగములతోఁ గూడి యడవివసించెడు నగస్త్యుఁడు సముద్రమును గ్రోలెను. తాను మనుజుండై శ్రీరాముఁడు కోతులతోఁగూడి సముద్రమున రాళ్లుతేలించి లంకను ముట్టడించి రావణుని సంహరించెను. ఒకచక్రముగలబండి నెక్కి నిరాలంబమగు నాకాశమున కాళ్లులేని సారథితో సూరుఁడు తిరుగుచున్నాఁడు. కావున మహాత్ములకు సాధనము లవసరములేదని బ్రహ్మదతుఁడు భార్య ఘోటకముఖుఁడు చెప్పిరి. మల్లిక పుష్పధనుస్సు తుమ్మెదలనారియుం గలిగి స్త్రీల చంచల దృక్కులయొక్క వారచూపులు బాణములుగాఁ జేసికొని మన్మథుఁడు దేహములేనివాఁడైనను మూఁడులోక