పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టాపథసత్రము కథ.

261

వారు చాలసేపు విద్యావిషయంబుల ముచ్చటించిరి. ఘోటకముఖుండు భోజునితో భైరవుండను తాంత్రికుఁడు పురందరపురములోనున్నట్లు వర్తమనము తెలిసినది. మన మందు పోవలయునని సూచించెను. ఆయన యందుల కంగీకరించెను.

మఱునాఁడు భోజుండును ఘోటకముఖుండును పురందరపురమున కరుగుచు బ్రహ్మదత్తుఁడున్న గదియొద్దకువచ్చి యతనితో ముచ్చటించుచు మల్లిక ప్రౌఢముగాఁ గవిత్వము చెప్పఁగలదని విని భోజుండు మిగుల నానందించుచుఁ బుత్రీ ! నేను నీకుఁ దండ్రివంటివాఁడ, నాకడ సిగ్గుపడనవసరము లేదు. నాకుఁ గవులయందుఁ జాలప్రేమగలదు. ఏదీ ? యొక్క శ్లోకము రచించి శ్రోత్రానందము గావింపుమని సాదరముగాఁ బలికెను.

అప్పు డాచిన్నది ఇంచుక తలవాల్చి మహాత్మా ! స్త్రీవిద్య యల్పమైనను గొప్పగాఁ జెప్పికొందురు. మీవంటి మహావిద్వాంసులకడ నేనొక పండితురాలననియుఁ గవిననియుం జెప్పికొనఁగలనా ! అయినను మీరు నన్నాదరించి యడిగినప్పు డుపేక్షించుట న్యాయముగాదు దేనిగుఱించి వర్ణింపవలయునో మీరే నిరూపింపుఁడు. నాశక్తికొలఁది శ్లోకము గావింతునని మృదుమధుర వాక్యములతోఁ బలికిన సంతసించుచు భోజుండు ముందుగా నీసమస్య నిచ్చి పూర్తిచేయుమనెను.

శ్లో॥ క్రియాసిద్ధిస్స త్వెభవతి మహతాంనోపకరణైః

ఆసమస్యను బ్రహ్మదత్తుండును భార్యయు ఘోటకముఖుండును మల్లికయుఁ బూర్తిజేసిరి.

బ్రహ్మదత్తుఁడు-

శ్లో. ఘటోజన్మస్థానంమృగపరిజనోభూర్జవసనో
    వనెవాసః కందాదికమశనమేవంవిధగుణః ।
    అగస్త్యః పాధోధిం యదకృతకరాంభోజకుహరె
    క్రియాసిద్ధిస్స త్వెభవతి మహతాంనోపకరణైః॥