పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చారాయణుని కథ.

255

నుభావులసాంగత్యము స్వల్ప కాలమైనను దీర్ఘ కాలప్రీతి గలుగఁజేయును గదా. అక్కటా ! నాదారిని నేనుబోవక నీకడ కేలవచ్చితిని ? ఆ! తెలిసినది. నానిమిత్తముననే నీ కీమరణము సంభవించినది. నాతో నీవు చనువుగా మాటలాడుచున్నావనియే వాని కసూయగలిగినది. భైరవా! యెందుబోయితివి ? నీకితం డేమియపకారముచేసెను ? నీవో నేనో కాక యితరు లెవ్వరున్నారు ? నిష్కారణము గురుద్రోహి వైతివేమి ? వీరిం జంపి యేమి మూటగట్టికొంటివి ? సందియము లేదు. నీవే చంపితివి. అని భైరవు నుద్దేశించి పలుకుచుండ నాదాపునడాగియున్న భైరవుం డత్యంతభైరవుండై యందువచ్చి యేమిరా చారాయణా ! ప్రేలుచుంటివి? ఈసిద్ధుని నేను జంపితినా? నీవు జూచితివా? నీవే చంపి నామీఁదఁ బెట్టుచుంటివి. తారతమ్య మెఱిఁగి మాట్లాడుము. ముందువచ్చిన చెవుల కన్న వెనుకవచ్చినకొమ్ములు వాడిగలవను సామెతవలెను నీవువచ్చి నన్నా క్షేపించుచుంటివా ? నాకంటె నీ కతండు దగ్గిరచుట్టమా? పో. పొమ్ము. నీవే చంపితివని గద్దించెను.

అప్పుడు చారాయణుఁడు కన్నీరుగార్చుచు నీమహానుభావుం జంపుటకు నా కేమియపకారము గావించెను ? మనముగాక యితరులు లేరు. మృగములు రాయి నెత్తిమీఁదవైచి చంపనేరవు. నిన్న నీ వారా యినితెచ్చుచుండ నేను జూచితిని. తప్పక నీవే చంపితివి. నీచా! నీ మొగము చూడఁగూడదు. నీకు యముఁ డెట్టినరకమిచ్చునో తెలియదు. మహాసాధువును నిష్కారణము జంపితివని క్రమక్రమప్రవర్ధమానంబగు కోపంబున నిందించుటయు వాఁడు, ఆఁ ! ఏమి నీక్రొవ్వు ! ఏమీ నీగరువము ! నన్ను నీచా ! యని సంబోధింతువా? యతిచావుమాట యటుండనిమ్ము. నీబ్రదుకుమాట చూచుకొమ్ము. అనిపలుకుచు నంతకు పూర్వమే తనచేతిలోదాచియుంచిన యోషధిందీసి చారాయణుని శిరంబున రుద్ది యేదియో తాయెత్తు గట్టెను. అతం డప్పుడే యొకగాడిద