పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చారాయణుని కథ.

253

మూఁడుదినములలో వాని కావిద్య యుపదేశింపకమానఁడు. నాపడిన శ్రమమంతయు వ్యర్థమైనది. గెద్దవలె వచ్చి వీఁడావిద్దె తన్ను కొనిపోవుచున్నాఁడు. ఇందుల కంతరాయ మెట్లుకల్పింతును? అని ధ్యానించు చుండెను.

సిద్ధునకుఁ జారాయణునందుఁ బ్రేమానుబంధము క్షణక్షణము వృద్ధిబొందుచుండెను. భైరవునకు వారిద్దఱియందును గ్రోధ మభివృద్ధి నొందుచుండెను. ఎల్లి శుభముహూర్తము వశిత్వముపదేశించెదఁ గైకొనుమని సిద్ధుండు చారాయణునితో రహస్యముగాఁ జెప్పుచుండ భైరవుండు చాటుననుండి యాలించెను. వానికి మనంబున నాందోళనము జనించినది. అనేకోహలు పుట్టినవి. కొన్ని నశించినవి. కొన్ని పూర్వపక్షములైనవి. తలఁచితలఁచి చివర కొకవిధానము నిశ్చయము చేసికొనియెను. ఆరాత్రి నిద్రబోలేదు.

ప్రతిదినము సిద్ధుండు యామావశిష్టమగు త్రియామనులేచి తటాకమున కరిగి స్నానముచేసి పర్ణశాలకు వచ్చి జపముచేసికొనుచుండును. చారాయణుఁడు సూర్యోదయమువఱకుఁ దటాకమునొద్దనే నిత్యక్రియలు నిర్వర్తించి పిమ్మట సిద్ధునొద్దకువచ్చి కూర్చుండును.

నాఁడు సిద్ధుండు వాడుకప్రకారము స్నానముచేసివచ్చి ప్రాణాయామయోగంబున జపముగావింపు చుండెను. చారాయణుఁడు తటాకంబున కరిగెను. ఆయవకాశము గ్రహించి బైరవుండు పెద్దపాషాణ మొకటి దెచ్చి సిద్ధుండు సూర్యోపాస్తికై భూమిజాగిలిబడి మ్రొక్కుచున్న సమయంబున పాషాణము సిద్ధునిశిరంబున గుభాలునఁ బడవైచెను. హా! పరమేశ్వరా! యని పలుకుచు గిలగిలఁ దన్నుకొని యతండు ప్రాణములు విడిచెను

పరమేష్ఠి వానిహృదయము ఇనుముతోనో చిట్టముతోనో చేసెను. కానిచో పరమదయాళుండై తనకెంతయో యుపకారముచేసి