పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నన్నుఁ బోవలదని బ్రహ్మదత్తుండు బ్రతిమాలికొనియెను. మిత్రుల వెంటఁబెట్టికొని సత్వరము రాఁగలనని చెప్పి యెట్ట కే నావిప్రునొప్పించి బయలుదేరితిని. సుఖము కష్టమునకును గష్టము సుఖమునకును గారణమగుచుండునుగదా? పదిదినములు శ్రమపడి నడిచితిని, దైవికముగా మీ యాశ్రమము గనంబడినది. మార్గగమనశ్రమమంతయుఁ బటాపంచలైనది. ఇందలిసత్వంబు లన్యోన్యవైరంబులు విడిచి తిరుగుచుండుటంబట్టి యిది తపోధనాశ్రమంబని తలంచితినిగాని స్వభావజన్యమగు భయము వదలినదికాదు.

జన్మపావనంబైన మీదర్శనంబై నది. కృతార్థుండనైతి. నా కింక కావలసినదేమియులేదని స్తుతియించుచుఁ దనవృత్తాంతమంతయు నెఱింగించెను. సిద్ధుండు చారాయణవిద్యావైదుష్యమును గుఱించి మిక్కిలి సంతసించుచుఁ బ్రస్థానత్రయమునందు నతనితో ముచ్చటించి తదీయాత్మ వేతృత్వమును బ్రశంసింపుచు సంతతము వానితోనే గోష్ఠిసేయుచుండును. తపముసేసికొను చున్నపుడుకూడ నవకాశముచేసికొని జ్ఞానమును గుఱించి యతనితో మాటలాడుచుండును.

కొన్నిదినములు గడిచినతరువాత సిద్ధునకుఁ దనవిద్య లతని కుపదేశముసేయవలయునని యభిలాష గలిగినది. బైరవునితోఁ జారాయణుఁడు వచ్చినదిమొదలు యతి తిన్నగా మాటాడుటలేదు. వాఁడు కపటాత్ముఁడని గ్రహించుటచేఁ బ్రీతి మునుపే తగ్గినది. బైరవుఁడు చారాయణునం దీసుబూని వీఁ డిక్కడినుండి యెట్లుపోఁగలఁడు ? ఉపాయమేమి ? యీ సిద్ధుండు వీనికతంబున నాతో మాటాడుటయే మానివేసెను. కాంచనయోగ ముపదేశింపమని నేనడుగ నిదిగో యదిగోయని జరపుచుండెను. నిన్న రాతిరి నీ కాయోగ ముపదేశించెదనని యారండాపుత్రునితోఁ జెప్పుచున్నాఁడు. అందులకు సరిపడిన నియమములు నాకడ లేవఁట. నే నుపవేశార్హుండఁ గానని టక్కు సేయుచున్నాడు. ఎట్లైనను రెండు