పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చారాయణుని కథ.

249

−♦ చారాయణుని కథ. ♦−

నేనొక బ్రాహ్మణపుత్రుండఁ జిన్నతనమునందె తల్లిదండ్రులు స్వర్గస్థులైనంత నిశాంతమునఁ బోషించువారు లేమింజేసి కాశీపురంబున కరిగితిని. అందు దత్తకాదిమిత్రులతోఁ గలిసికొని విద్యాభ్యాసము గావించితిని. వేయిమందిసహాధ్యాయులలో మే మేడ్వుర మచిరకాలములో సమస్తవిద్యలలో నుత్తీర్ణులమైతిమి. మాతో వాదింపఁదగిన పండితు లెందున్నారని తలంచి ధారానగరంబున భోజభూభుజుని యాస్థానమున గొప్పపండితులున్నారని విని వారితోఁ బ్రసంగింప వేడుకజెంది తలయొక దారి నయ్యూరికిఁ బోవుచుంటిమి. దేశవిశేషములం దెలిసికొనుచు వత్సరమునాఁటికి నావీటికిఁ జేరుటకుఁ గడు వేర్పఱచుకొంటిమి.

నే నొకమార్గంబునంబడి పురనదీపక్క ణారణ్యవిశేషంబులం జూచుచుఁ బోవుచుంటిని. యౌవనమదము కడుగర్వమును గలిగించును. ఈమార్గము కడుసంకటమైనది. దూరమునఁగాని గ్రామమేదియును లేదు. పోవలదని బయలుదేరునపు డొకపల్లెలోనివా రెంతచెప్పినను లక్ష్యముసేయక యాదారినే పోవ మొదలుపెట్టితిని. అక్కటా ! ఆపయనంబునంగల యిక్కట్టు చెప్పుటకుఁ బదిదినములు పట్టును. ఎడారియును గాదు, ఆరణ్యముం గాదు, పాషాణకంటకాదులచే నావృతమై యున్నది. ఎంతదూరముపోయినను నీరు దొరకదు. పశుపక్షిమృగాదు లేవియుం గనంబడవు. మధ్యాహ్నసమయంబుల వైతరణీనదియుంబోలె నెండమావు లూరక ప్రవహింపుచుడును. వానింజూచి జలమని పెక్కుసారులు మోసపోయితిని.

నేను దెచ్చికొనిన ద్రవపదార్థములు పిండియు నై పోయినవి. నాలుగుదినములు ధైర్యముతో నడిచితిని. మార్గమంతయు నొకరీతిగానే యున్నది. కాళులు పొక్కు లెక్కినవి. జవసత్వము లుడిగినవి. అడు గామ డగా నుండెను. నాలుగవదివసంబున రాత్రియెల్ల నొకరాతిపైఁ బండికొని